పాన్ ఇండియా స్టార్స్ అనగానే దాదాపు సౌత్ హీరోల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఓ రకంగా పాన్ ఇండియా అనే బ్రాండ్ ని వెలుగులోకి తెచ్చింది మన తెలుగు హీరోలే. బాహుబలితో ప్రభాస్, అల్లు అర్జున్(పుష్ప), రామ్ చరణ్ - ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్) పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. కన్నడ నుండి యష్, రిషబ్ శెట్టి సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకున్నారు. కానీ.. ఇప్పటిదాకా మలయాళం నుండి ఏ ఒక్క హీరో ఎస్టాబ్లిష్ కాకపోవడం గమనార్హం.
కొంతకాలంగా పాన్ ఇండియా స్టార్స్ అనగానే దాదాపు సౌత్ హీరోల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఓ రకంగా పాన్ ఇండియా అనే బ్రాండ్ ని వెలుగులోకి తెచ్చింది మన తెలుగు హీరోలే అని చెప్పుకోవచ్చు. హీరోలు అనడం కంటే.. దర్శకుడు రాజమౌళి అంటే బాగుంటుందేమో! ఎందుకంటే.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ వైపు.. ప్రభాస్ ఎప్పుడైతే అడుగులు వేశాడో.. అప్పటినుండి వరుసగా అల్లు అర్జున్(పుష్ప), రామ్ చరణ్ – ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్) పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే.. వీళ్ళు తెలుగు హీరోలు. కానీ.. అనూహ్యంగా కన్నడ నుండి కేజీఎఫ్ వచ్చింది.. అంతే హీరో యష్ పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్నాడు.
గతేడాది కాంతార వచ్చింది.. ఇంకేముంది రిషబ్ శెట్టి కూడా సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకున్నాడు. అలా తమిళంలో సూపర్ స్టార్ రజినీ, కమల్ హాసన్ ఉన్నారు. ఈ తరం హీరోలలో చెప్పుకుంటే పాన్ ఇండియా హీరోలుగా అయితే ఇంకా ఎవరు ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ.. విజయ్, ధనుష్, విక్రమ్, విజయ్ సేతుపతి, అజిత్ లాంటి హీరోలకు ఆ రేంజ్ ఇమేజ్ అయితే ఏర్పడింది. అయితే.. తమిళ హీరోల పేర్లు కనీసం సౌత్ లో అయినా మార్మోగుతాయి. కానీ.. ఇప్పటిదాకా పాన్ ఇండియా హీరో లేదా పాన్ ఇండియా సినిమా అనేది మలయాళం నుండి ఒక్కటీ రాలేదు. ఏ ఒక్క హీరో ఎస్టాబ్లిష్ కాకపోవడం గమనార్హం.
మోహన్ లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ.. ఇంకా మల్లూవుడ్ బయటికి విస్తరించేందుకు తడబడుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే ఫహద్ ఫాజిల్, దుల్కర్ సల్మాన్, టివినో థామస్ లాంటి యంగ్ హీరోల పేర్లు బయట ఇండస్ట్రీలలో కూడా వినిపిస్తున్నాయి. అయినా.. మల్లూవుడ్ నుండి పాన్ ఇండియా రేంజ్ లో చర్చించుకునే హీరోలు ఇంకా రాలేదు. ఈ క్రమంలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.. మల్లూవుడ్ కి పాన్ ఇండియా హీరోని ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడట. టాలీవుడ్, శాండల్ వుడ్ హీరోలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని.. దుల్కర్ మల్లువుడ్ లో పాన్ ఇండియా హీరో అనే లోటును పూడ్చే ఆలోచనలో ఉన్నాడట.
అందుకు ఒకే ఒక్క మార్గం.. ప్రెజెంట్ దుల్కర్ చేస్తున్న ‘కింగ్ ఆఫ్ కోతా'(KOK) అని అంటున్నాయి సినీ వర్గాలు. కన్నడ ఇండస్ట్రీకి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిన క్రెడిట్ రాకీ భాయ్ యష్ కి.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి దక్కుతుంది. సో.. మలయాళం ఇండస్ట్రీకి కేఓకే మూవీ ద్వారా తనని తాను రాకీ భాయ్ లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడట దుల్కర్. ఈ ‘కింగ్ ఆఫ్ కోతా’ మూవీని డెబ్యూ డైరెక్టర్ అభిలాష్ జోషి తెరకెక్కిస్తున్నాడు. ఇన్నాళ్లు డీసెంట్ రోల్స్, క్లాస్ సినిమాలతో మెప్పించిన దుల్కర్.. కోతా మూవీతో తనలోని మాస్ యాంగిల్ ని బయట పెట్టనున్నాడట. ఈ సినిమా కూడా యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతుండటం విశేషం.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. కింగ్ ఆఫ్ కోతాలో దుల్కర్ క్యారెక్టర్.. కేజీఎఫ్ లో రాకీ భాయ్ ని మించి ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ పూర్తయింది. దీంతో లాస్ట్ డే షూటింగ్ కంప్లీట్ చేసి.. టీమ్ తో సందడి చేసిన వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు దుల్కర్. గతేడాది షూటింగ్ ఎక్కడైతే మొదలుపెట్టారో.. అక్కడే ఫినిష్ చేయడం విశేషం. ఆల్రెడీ దుల్కర్ కి ఏ భాషకి ఆ భాషలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ.. మలయాళం ఇండస్ట్రీకి ఒక్క పాన్ ఇండియా హీరో లేడనేది చర్చనీయాంశంగా మారింది. ఆ లోటుని దుల్కర్ ఫినిష్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ‘కింగ్ ఆఫ్ కోతా’ మూవీ దుల్కర్ ని యాక్షన్ స్టార్ గా నిలబడుతుందేమో చూడాలి. ఇందులో దుల్కర్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఒకవేళ సినిమా హిట్ అయితే మాత్రం.. మల్లూవుడ్ కి దుల్కర్ పాన్ ఇండియా హీరో ఉన్నాడని ప్రూవ్ చేసినవాడు అవుతాడు. మరి దుల్కర్ సల్మాన్ గతేడాది సీతారామంతో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు కేఓకేతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైనప్ చేశాడు. మరి చాక్ లెట్ బాయ్ గా పేరొందిన దుల్కర్ సల్మాన్.. కింగ్ ఆఫ్ కోతాతో పాన్ ఇండియా హీరో అవుతాడా? ఒకవేళ క్లిక్ అయితే ఇండియాకి మరో పాన్ ఇండియా స్టార్ దొరికినట్లే.. అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. సో.. నెక్స్ట్ పాన్ ఇండియా లిస్ట్ లో చేరే హీరోలలో దుల్కర్ ఉంటాడా ఉండడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.