చిత్రపరిశ్రమలో ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు.. ఒక్కోసారి ఒక్క ఫోటోతో కూడా వచ్చేస్తుంది. ఏమేం సినిమాలు చేశారు? ఏయే హీరోల పక్కన నటించారు? అనే దానికంటే వారిలో ప్రత్యేకత ఏంటనేది ఆసక్తికరమైన విషయం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ పిక్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ టాల్ హీరో అనగానే అందరికి రానా దగ్గుబాటి పేరే గుర్తొస్తుంది. ఎందుకంటే.. రానా హైట్ 6 అడుగులకు మించి ఉంటుంది. రానాతో పాటు డార్లింగ్ ప్రభాస్ హైట్ కూడా ఎక్కువే. అయితే.. ఇప్పుడు వైరల్ అవుతున్న పిక్ లో రానా పక్కన ఉన్న వ్యక్తిని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. రానా మించిన హైట్ తో ఉండటమే అతని ప్రత్యేకత. పైన పిక్ ని గమనిస్తే.. రానా ఎదురుగా హీరోయిన్ క్యాథరిన్ కనిపిస్తోంది. సో.. ఈ పిక్ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా టైంలో తీసుకున్నట్లు అర్థమవుతుంది.
ఈ పిక్ లో రానా పక్కన ఉన్న వ్యక్తి హైట్ చూసి షాక్ అయ్యింది క్యాథరిన్. కాగా.. ఈ పిక్ లో కనిపిస్తున్న వ్యక్తి సుమారు 7 అడుగులకు మించి ఉంటాడని తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా నటించాడు. ఆ సినిమాలో పవన్ ని ఏకంగా చంకలో ఎత్తుకుంటాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో గుర్తుందా మరి.. ఆ సినిమానే జానీ. పవన్ కళ్యాణ్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో మార్కెట్ సీన్ లో ఈ వ్యక్తి కనిపిస్తాడు. అలాగే పవన్ హీరోయిన్ కోసం వెతికే టైంలో చంకలో ఎక్కించుకొని తిప్పుతాడు. ప్రస్తుతం ఈ వ్యక్తి ఎవరనే వివరాలు తెలియలేదు. కానీ టాలీవుడ్ లోనే టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేస్తాడని సమాచారం. మరి ఇప్పుడైతే ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వ్యక్తి హైట్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ చేయండి.