దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతున్న సంగతి అందరికి విదితమే. ఆయన దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ఖాతాలో ఆస్కార్ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయాన దర్శకధీరుడు జక్కన్నకు మరో అరుదైన గౌరవం దక్కింది. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే మంచి అవకాశం వచ్చింది. అంతేకాదు.. తన వంతుగా ప్రజలను చైతన్య పరిచేందుకు ఇదొక సువర్ణావకాశం. జక్కన్నకు దక్కిన గౌరవం ఏంటి..? రాజకీయాల్లో ఆయన ఏం చేయబోతున్నారో తెలియాలంటే.. కింది కథనం చదివేద్దాం..
ప్రముఖ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతున్న సంగతి అందరికి విదితమే. ఆయన దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ఖాతాలో ఆస్కార్ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయాన దర్శకధీరుడు జక్కన్నకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ఎన్నికల ప్రచారకర్తగా నియమించారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు.. రాజమౌళిని ఎన్నికల ఐకాన్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకుగానూ ‘మే’ నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఓటర్లను చైతన్యపరిచేందుకు ఎన్నికల సంఘం, రాజమౌళిని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. జక్కన్న మునుపటిలా ఇప్పుడు సాధారణ వ్యక్తి కాదు. ఆర్ఆర్ఆర్ ప్రభంజనంతో ప్రపంచంలోనే ప్రభావశీల వ్యక్తిగా మారుతున్నాడు. ఈ క్రమంలో ఆయన చెబితే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తారని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు జక్కన్నతో కలిసి పని చేసేందుకు నిర్ణయించినట్లు రాయచూర్ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఈ ప్రతిపాదనను రాజమౌళి అంగీకరించారని ఆయన వెల్లడించారు.
రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళిని నియమించిన రాయచూరు జిల్లా కలెక్టర్.
రాయచూరులో జన్మించిన రాజమౌళి ప్రచారం ద్వారా పోలింగ్ శాతం పెరగుతుందని భావిస్తున్నారు.
#SSRajamouli #Rajamouli #Raichur #Karnataka pic.twitter.com/Gg6BNnXAMd— Telugu Scribe (@TeluguScribe) March 10, 2023
“పలు విజయవంతమైన సినిమాలు తీసిన రాజమౌళి.. దేశంలోని చాలా మందికి సుపరిచితమే. అందుకే రాజమౌళికి ఈ బాధ్యతలకు అప్పగిస్తున్నాం. ప్రజలు ఆయనను సులువుగా గుర్తిస్తారు. ఆయన ప్రచారం చేస్తే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. రాయచూర్ జిల్లా ఎన్నికల ఐకాన్‌గా ఉండేందుకు రాజమౌళి గారు కూడా అంగీకరించారు.. ” అని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కాగా, జక్కన్న స్వస్థలం.. రాయచూర్ జిల్లా, మానవి తాలుకాలోని అమరేశ్వర్ క్యాంప్. ఈ విషయాన్ని ఆయనే గతంలో ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఓ నెటిజన్ మీరు పుట్టిన ఊరి పేరు ఏంటి? అని అడగ్గా ‘అమరేశ్వర క్యాంపు, మాన్వి తాలుకా, రాయచూర్ జిల్లా, కర్ణాటక’ అని రాజమౌళి రిప్లయ్ ఇచ్చాడు. అందువల్లే.. రాయచూర్ కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనా.. పుట్టిన గడ్డ రుణం రాజమౌళి ఇలా తీర్చుకోనుండటం మంచికే. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
@Shivaji_M amareshwara camp, manvi taluka, raichur district, Karnataka…:)
— rajamouli ss (@ssrajamouli) March 10, 2012