పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లు, రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య పవన్ కు అభినందనలు తెలుపుతూ.. ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే అభిమానుల్లో తెలియని ఓ పూనకం బయలుదేరుతుంది. ఇక పవర్ స్టార్ అంటే అభిమానించని వారు ఉండరు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకూ చాలా మంది పవన్ ను అభిమానిస్తుంటారు. ఇక సెలబ్రిటీలు అయితే మూవీ ఫంక్షన్స్ లల్లో పవన్ పై ఉన్న ప్రేమను మాటల్లో చూపించడం మనం ఎన్నో సార్లు చూశాం. అయితే తాజాగా పవర్ స్టార్ 27 ఏళ్ల సినిమా కెరీర్ తో పాటుగా రాజకీయాల్లో 10 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటుగా సెలబ్రిటీలు సైతం పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ సీఎంగా చూడాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు తమిళ నటుడు, డైరెక్టర్ ఎస్ జే సూర్య.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 27 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇక రాజకీయాల్లోకి సైతం వచ్చి 10 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లో దుసుకెళ్తున్నారు పవన్. ఈ క్రమంలోనే పవన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య. ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లు, రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్ జే సూర్య, పవన్ కు అభినందనలు తెలుపుతూ.. ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
ఆ వీడియోలో సూర్య ఈ విధంగా మాట్లాడాడు.”పవన్ కళ్యాణ్ తెరపైనే కాదు.. జనాల్లో కూడా హీరోనే. అతను గ్రేట్ పొలిటికల్ లీడర్. ప్రజల కోసం ఆయన చేసే పోరాటం హిస్టరీలో నిలిచిపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ CM పవన్ కళ్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను” అని తన మనసులోని మాటను, పవన్ పై అభిమానాన్ని బయటపెట్టాడు ఎస్ జే సూర్య. అయితే పవన్ సీఎం అవ్వాలన్న కోరిక నా ఒక్కడిదే కాదని, ఎంతో మంది అభిమానుల కోరిక కూడా అని ఈ సందర్భంగా అన్నాడు. ఇక పవన్ గురించి నేను ఎప్పుడు మాట్లాడుతున్నా ది గ్రేట్ లీడర్ ఎంజీఆర్ గుర్తుకు వస్తారని సూర్య చెప్పుకొచ్చాడు.
అయితే ఎస్ జే సూర్య, పవన్ కాంబినేషన్ లో వచ్చిన ఖుషీ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత పులి సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం బంధం కుదిరింది. ప్రస్తుతం ఎస్ జే సూర్య చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియోను జనసేన పార్టీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి సీఎంగా పవన్ కళ్యాణ్ ను చూడాలని ఉంది అన్న డైరెక్టర్ ఎస్ జే సూర్య వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
దిగ్విజయభేరి !
శ్రీ పవన్ కళ్యాణ్ గారి 27 ఏళ్ల సినీ ప్రస్థానం, జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం గురించి దర్శకుడు,నటుడు శ్రీ ఎస్.జె. సూర్య గారు
Director,Actor @iam_SJSuryah garu abt 27 years of Sri #PawanKalyan garu’s film career & JanaSena’s 10th formation day#27YearsOfPawanKalyan pic.twitter.com/mgAcQV5rdh
— JanaSena Party (@JanaSenaParty) March 10, 2023