Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలతో స్టార్డమ్ సంపాదించుకున్న ధనుష్.. డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. అయితే.. టీనేజ్ లోనే సినీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధనుష్.. కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు భరించానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు తెలుస్తుంది.
ఇక తమిళ, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్.. త్వరలోనే ‘ది గ్రే మ్యాన్’ అనే సినిమా ద్వారా హాలీవుడ్ లో అడుగుపెట్టనున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ తన కెరీర్ లో జరిగిన అవమానాలు తలచుకొని ఎమోషనల్ అయ్యాడు. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ కస్తూరి రాజా కొడుకుగా 2002లో ‘తుళ్లువాదో ఇలమై’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2003లో హీరోగా ‘కాదల్ కొందెన్’ సినిమా చేశాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారని చెప్పాడు ధనుష్. కెరీర్ ప్రారంభంలో నేను బక్కపలుచగా ఉండటం వల్ల చాలామంది నువ్వు హీరో ఏంటి అంటూ ఎగతాళి చేశారు. షూటింగ్ జరిగేటప్పుడు కొందరు వచ్చి హీరో ఎవరని నన్నే అడిగారు. ఆ అవమానం తట్టుకోలేక వేరే వాళ్ళని హీరోగా చూపించాను. చివరికి నేనే హీరో అని తెలుసుకొని పగలబడి నవ్వారు’ అంటూ ధనుష్ ఎమోషనల్ అయ్యాడు.
ఆ రోజుల్లో నన్ను హేళన చేయనివారు లేరు. కొందరైతే ఏకంగా ఆటో డ్రైవర్ లా ఉన్నావు. నువ్వు హీరోనా అంటూ పెద్దఎత్తున ఎగతాళి చేశారు. ఆ విధంగా ఎగతాళి చేసేసరికి ఓసారి కారులోకి వెళ్లి బోరున ఏడ్చాను’ అని ధనుష్ ఈ సందర్భంగా బయటపెట్టాడు. ఆ తర్వాత తనకు తానే ధైర్యం చెప్పుకొని సినిమాలలో నటించి, నేడు ఈ స్థాయిలో ఉన్నానని ధనుష్ చెప్పడం విశేషం. మరి ధనుష్ కెరీర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
The Gray Man It Is!! 🔥❤@dhanushkraja @ChrisEvans @Russo_Brothers #TheGrayMan #Hollywood #Netflix #Dhanush pic.twitter.com/k3A8bLBOKx
— Behindwoods (@behindwoods) December 17, 2020