దీపికా పదుకొణె.. బాలీవుడ్ లో అగ్రకథానాయికగా వెలుగుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుంది. ప్రస్తుతం ఈ అందాల బామ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ అమ్మడు తన చిన్ననాటి జ్ఞాపకాలను, కళను అందరితో పంచుకునే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: కుమార్తె డ్యాన్స్ చూసి మురిసిపోయిన మహేష్!
నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు టీచర్ ‘ఐ యామ్’ అనే రెండు పదాలు ఇచ్చి ఓ కవితను రాయమన్నారు. ఆ రెండు పదాలనే టైటిల్‌గా పెట్టి 12ఏళ్ల వయసులోనే మూడు పేరాల కవితను రాశానని ఆ విధంగా రాయడం మొదటి, చిట్ట చివరి ప్రయత్నమంటూ దీపికా క్యాప్షన్ ను జోడించింది. తాజాగా ఆ కవితను ఫొటో తీసి దీపిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీపికా పోస్ట్ చేసిన ఆ కవితపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.