పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో లీక్ అయినట్టుగా భావిస్తున్న లుక్ అంచనాలను మరింతగా పెంచేస్తుంది. డార్లింగ్ కటౌట్ అదిరిందంటున్నారు ఫ్యాన్స్. ఆ వివరాలు మీ కోసం..
చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న బాహుబలి ప్రభాస్ తాజా సినిమా ఫౌజీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సీతారామం వంటి క్లాసికల్ సినిమాతో అందర్నీ ఆకట్టుకున్న హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దేశ స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథాంశంతో లవ్ స్టోరీ ఇది. ఈ క్రమంలో ప్రభాస్ లుక్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఫౌజీ సినిమా నుంచి లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ లుక్‌లో ప్రభాస్ బ్లూ షర్ట్ ధరించి కూర్చుని ఉన్నాడు. క్లీన్ షేవ్ లుక్‌తో ఉన్న డార్లింగ్ కటౌట్ అద్దిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. సీతారామంలానే ఇది కూడా క్లాసికల్ లవ్ స్టోరీగా ఉంటుందని అంచనా.
ఈ సినిమా 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తుండగా ఫ్లాష్‌బ్యాక్ స్టోరీలో సాయి పల్లవి ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌తోపాటు బాలీవుడ్ వెటరన్ నటులు మిధున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ , జయప్రద నటించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.