మన దేశంలో రాజకీయాల్లో, సినిమా రంగంలో వారసులు ఎంట్రీ ఎక్కువగా ఉంటుంది. కుటుంబం నుంచి ఒక్కరు సక్సెస్ అయితే చాలు.. ఇక ఆ కుటుంబం నుంచి మరికొంత మంది ఎంట్రీ ఇస్తారు. అయితే ఇక్కడ కుటుంబ నేపథ్యం కేవలం ఎంట్రీ వరకే ఉపయోగపడుతుంది.. కానీ ఆ తర్వాత రాణించాలంటే మాత్రం ప్రతిభ ఉంటేనే సాధ్యం అవుతుంది. ఇక ఆ విషయాన్ని పక్కకు పెడితే.. వారసులను తీసుకువచ్చే విషయంలో కూడా ఆడ, మగ తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయాల్లోకి అయితే కుమార్తెలును తీసుకురావడానికి ఏమాత్రం ఆలోచించరు కానీ అదే సినిమాల్లోకి అంటే మాత్రం వెనకడుగు వేస్తారు. ఇక తమ అభిమాన హీరోల కుమార్తెలను హీరోయిన్‌లుగా చూడ్డానికి మన దగ్గర ప్రేక్షకులు అంగీకరించరు.
ఈ అంశంలో బాలీవుడ్ కాస్త బెటర్. ఇక మన దగ్గర గతంలో కృష్ణ కుమార్తె మంజుల హీరోయిన్‌గా చేయాలని భావించారు. కానీ అభిమానులు అందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక, మంచు లక్ష్మి మాత్రం తెరపై రాణిస్తున్నారు. ఇక కమల్ హాసన్ కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్.. హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కమెడియన్ చేరారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కుమార్తె హీరోయన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: మెగా కాంపౌండ్ లోకి 30 ఇయర్స్ పృథ్వీ! చిరు గొప్పతనం అదే!
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తన కుమార్తెని వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం చేయబోతున్నారట. తన కుమార్తె శ్రీలు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసి, మలేసియాలో సెటిల్ అవ్వాలనుకుందనీ, అయితే ఆమెకు డాన్స్ మీదా నటన మీదా ఇష్టం పెరగడంతో, ఆ దిశగా శిక్షణ తీసుకుందనీ చెప్పారు పృధ్వీ. ఘనంగా తానే సినీ పరిశ్రమకు పరిచయం చేద్దామని అనుకున్నప్పటికీ కుదరలేదనీ, తన స్నేహితుడి కుమారుడు క్రాంతి హీరోగా రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోందని చెప్పారు పృధ్వీ.
ఇది కూడా చదవండి: Ramesh Babu Wife: నెట్టింట వైరలవుతోన్న రమేష్ బాబు భార్య, కుమారుడి వీడియో!
ఆ సినిమా పేరు ‘కొత్త రంగుల ప్రపంచం’ అట. ముగ్గురు నిర్మాతలు ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యిందట కూడా. సీనియర్ రచయిత ఘటికా చలం ఈ సినిమాకి ఎంతో సాయం చేశారని పృధ్వీ చెప్పారు. నటుడిగా తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు, తన కుమార్తెను కూడా ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకుందని అన్నారు పృథ్వీ. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Jabardasth Rohini: 1000 ఏళ్ళనాటి లండన్ పబ్ లో జబర్దస్త్ రోహిణి.. వీడియో వైరల్!