హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులు.. ఇదే వార్త గత కొంత కాలం నుంచి దక్షిణాది మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాళ్లు ఖచ్చితంగా విడిపోతున్నారని కొందరంటుంటే.., కాదు కాదు, మళ్లీ కలుస్తున్నారని మరికొందరు అంటున్నారు. అయితే తాజాగా ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకోవడం లేదని, ఇద్దరు మళ్లీ కలిసిపోతున్నారంటూ మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదే విషయంపై తాజాగా ధనుష్ సన్నిహితులు స్పందిస్తూ వీరిద్దరి విడాకులు, మళ్లీ కలవడంపై ఓ క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వాళ్లిద్దరూ మళ్లీ కలవడం అలాంటి ఏం లేదని, అవన్నీ పుకార్లే అంటూ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. బహుశా పిల్లల విషయంలో కలుసుకున్నప్పుడు ఇలాంటి వార్తలు పుట్టుకొస్తున్నాయని, కనీసం వారు మాట్లాడుకోవడం కూడా లేదంటూ తెలిపారు. కాగా ధనుష్, ఐశ్వర్య 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొంతకాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక 18 ఏళ్ల వీరి వివాహ బంధంలో ఉన్నట్టుండి విడాకులు తీసుకుంటున్నామని తెలపడంతో సినీ అభిమానులు అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కానీ వీరి విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు వచ్చినప్పటి నుంచి మళ్లీ కలిస్తే బాగుండూ అంటూ ధనుష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. ఇక ధనుష్ సన్నిహితులు ఇచ్చిన క్లారిటీలో ఫ్యాన్స్ మారోసారి నిరాశలోకి వెళ్లిపోయారు.