సెలబ్రిటీల షూటింగ్ ముచ్చట్లు, ఆన్ లొకేషన్ ఫోటోస్ వారి ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లను కూడా భలే ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల త్రోబ్యాక్ పిక్స్ అయితే బాగా వైరల్ అవుతుంటాయి.
సెలబ్రిటీల షూటింగ్ ముచ్చట్లు, ఆన్ లొకేషన్ ఫోటోస్ వారి ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లను కూడా భలే ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల త్రోబ్యాక్ పిక్స్ అయితే బాగా వైరల్ అవుతుంటాయి. ఈ ఫోటోలో ఉన్న హీరో హీరోయిన్లను గుర్తు పట్టారా?. వీరిద్దరూ కలిసి నటించడం అదే మొదటిసారి. హీరోకి డెబ్యూ మూవీ కాగా అమ్మాయికి మూడో సినిమా. అంతకుముందు కన్నడలో రెండు చిత్రాలు చేసింది. ఇది ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఫిలిం. ఇక మరీ లేతగా కనిపిస్తున్న ఈ కథానాయకుడు తమిళనాట స్టార్ హీరోగా సత్తా చాటుతున్నాడు.
ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. ధనుష్. హీరోయిన్ పేరు షెరీన్ శ్రీనగర్. ఈ పిక్ 2002వ సంవత్సరంలో తీసింది. వివరాల్లోకి వెళ్తే.. ధనుష్ తమిళంలో ‘తుల్లువదోల్లమయి’ (Thulluvadho Ilamai) సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. కస్తూరి రాజా డైరెక్ట్ చెయ్యగా.. రామకృష్ణన్ నిర్మించారు. బెంగుళూరుకి చెందిన షెరీన్ అంతకుముందు కన్నడలో ‘పోలీస్ డాగ్’, ‘ధృవ’ సినిమాలు చేసి, ఈ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమా షూటింగ్ సమయంలో తీసిన రేర్ పిక్ ఇది. ఇద్దరూ టీనేజ్‌లో క్యూట్‌గా కనిపిస్తున్నారు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫిలిం తెలుగులో అల్లరి నరేష్ హీరోగా ‘జూనియర్స్’ పేరుతో రీమేక్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత దానయ్య ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఈ రీమేక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది షెరీన్. తర్వాత కృష్ణవంశీ తీసిన ‘డేంజర్’ లోనూ నటించింది.