ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టార్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంత కాలం నుంచి ప్రముఖ నటులు మరణిస్తూ వచ్చారు. అయితే, తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టార్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విశాఖ నుంచి వస్తుండగా ఆయన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయినట్లు తెలుస్తుంది. దీంతో అతని సన్నిహితులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు.
ఇక వైద్యులు అతనికి చికిత్స అందించిన ఫలితం లేకపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. రాకేష్ మాస్టర్ దాదాపు 1500 సినిమాలకు గాను కొరియోగ్రఫీ చేశారు. ఆయన ప్రముఖ కొరియోగ్రాఫర్లు అయిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వారికి శిక్షణ కూడా ఇచ్చారు.