రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముందే మెుదలైంది. ఈ సందడిని బాలకృష్ణ.. వీరసింహారెడ్డితో మెుదలెడితే.. మెగాస్టార్ పూనకాలు లోడింగ్ వాల్తేరు వీరయ్యతో కంటిన్యూ చేస్తున్నారు. కె. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ యాక్షన్, కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల వద్ద మాస్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. భారీ కటౌట్స్ తో పాటుగా బ్యాండ్ లు మోగిస్తూ.. డ్యాన్స్ లతో ఓ జాతరని తలపిస్తున్నా రెండు రాష్ట్రాల్లోని థియేటర్లు. ఇక కర్ణాటకలో అయితే మెగాస్టార్ చిరంజీవి ఫాలోయింగ్ చూస్తే.. దిమ్మతిరిగిపోతుంది. 154 వాల్తేరు వీరయ్య పోస్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు బెంగళూరు అభిమానులు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అద్వితీయం.. అమోఘం.. అనిర్వచనీయం ఆయన నటన. రికార్డులు సైతం సలాం కొట్టి గులాం అంటాయి ఆయన వెండితెరపై వెలిగితే. నటన సైతం ఆయన యాక్టింగ్ ముందు నివ్వెరపోతుంది.. అంతలా తెలుగు ప్రేక్షకులతో హృదయాల్లో నిలిచిపోయారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా వాల్తేరు వీరయ్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తో దూసుకెళ్తోది. ఇక థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సృష్టిస్తున్న హంగామ అంతా..ఇంతా కాదు. థియేటర్లు ఓ జాతరను తలపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా చిరంజీవికి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి మనకు తెలిసిందే..
ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కావడంతో దేశ వ్యాప్తంగా ఉన్న చిరు అభిమానులు మెగాస్టార్ పై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో 154 వాల్తేరు వీరయ్య పోస్టర్లతో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు అభిమానులు. 154 వీరయ్య పోస్టర్లను ఆటోపై కట్టుకుని తమ ప్రేమను చాటుకున్నారు. చిరంజీవి నటించిన ఈ చిత్రం 154వది కావడంతో అభిమానులు ఇలా ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా నటించాడు. యాక్షన్ తో పాటుగా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ అద్బుతంగా తెరకెక్కించాడని తెలుస్తోంది.
Karnataka Mega Fans Huge Rally with 154 Autos. #WaltairVeerayya #WaltairVeerayyaOnJan13th #Bangalore #karnatka #MegaStarChiranjeevi pic.twitter.com/d89mn7x7Pq
— Pavanheartkiller (@Pavanheartkill1) January 12, 2023