పెరుగుతున్న టెక్నాలజీతో.. అనేక సదుపాయాలు అందుబాటులోకి వచ్చి.. మన జీవితాలు మరింత సౌకర్యవంతంగా మారాయి. అయితే కొన్ని సదుపాయాలు మాత్రం.. లాభాలతో పాటు నష్టాలను కూడా మోసుకొస్తున్నాయి. అలాంటిదే.. సోషల్ మీడియా వినియోగం. దీని వల్ల ఎన్ని లాబాలున్నాయో.. అంతే నష్టాలున్నాయి. ఒకరు రాత్రికి రాత్రే స్టార్ కావాలన్నా.. తప్పుడు సమాచారం నిమిషాల వ్యవధిలో ప్రచారం కావాలన్నా.. సోషల్ మీడియాకే సాధ్యం. ఇక సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య సోషల్ మీడియా వారధిగా మారింది. సెలబ్రిటీలు తమకు సంబంధించి అన్ని రకాల అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే అవకాశం.. సోషల్ మీడియా వల్ల కలిగింది.
సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. మెగా డాటర్ శ్రీజ కూడా.. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా శ్రీజ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. 2022లో తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిశానని.. కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నాను అంటూ శ్రీజ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. అసలు శ్రీజ ఎవరిని కలిసింది.. కొత్త ప్రయాణం దేని గురించి అంటే..
న్యూఇయర్ సందర్బంగా 2022లో జరిగిన అనుభవాలను గుర్తు చేసుకుటూ.. ‘‘డియర్ 2022 నీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఏడాది నేను నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కలిశాను. నా గురించి ఎవరికైతే పూర్తిగా తెలుసో.. ఎవరైతే నన్ను అమితంగా ప్రేమించగలరో.. ఎవరైతే.. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకోగలరో.. నిత్యం నా పక్కనే ఉంటూ.. కష్టసుఖాల్లో తోడుండగలరో.. అలాంటి వ్యక్తిని నేను కలిశాను.. అది ఎవరంటే.. ప్రియమైన నేను.. ఎట్టకేలకు నన్ను నేను కలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. కొత్త ప్రయాణం ప్రారంభం’’ అంటూ శ్రీజ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మనల్ని మనం ప్రేమించుకోవడమే అన్నింటికన్నా ఉత్తమం.. వెల్కమ్ 2023 అంటూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది శ్రీజ. ప్రసుత్తం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.