ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు వారి సినిమాలు రిలీజ్ అయ్యాయంటే మూవీ టాక్ తో పాటు రివ్యూలు, రేటింగ్స్ రావడం మామూలే. ఈ సినిమా రివ్యూల సిస్టమ్ ఎప్పటినుండో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్నిసార్లు రివ్యూలు, రేటింగ్స్ ఘోరంగా వచ్చినా.. సినిమాలు ఊహించని విజయాలను అందుకుంటాయి. అలా రీసెంట్ గా యూఎస్ఏ మార్కెట్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమాని.. డైరెక్టర్ బాబీ తెరకెక్కించాడు. మైత్రి మూవీస్ వారు ఈ సినిమాను యాక్షన్ కామెడీ జానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఇక థియేటర్స్ లో విడుదలయ్యాక వీరయ్య సినిమా.. తెలుగు రాష్ట్రాలలో పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొట్టింది. చిరంజీవి కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించి పెట్టింది. రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజైన వాల్తేరు వీరయ్య.. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూల్ చేసింది. ప్రస్తుతం అన్ని ఏరియాలతో పాటు యూఎస్ఏలో కూడా బ్రేక్ ఈవెన్ పూర్తిచేసి భారీ లాభాలలో దూసుకుపోతుంది. ఈ క్రమంలో వీరయ్య సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి.. తాజాగా యూఎస్ ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ మూవీ రేటింగ్స్ పై తనదైన శైలిలో కౌంటర్ వేశారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
చిరు మాట్లాడుతూ.. “యూఎస్ లో కొన్ని వెబ్ సైట్స్ ఈ మూవీకి కేవలం 2.25, 2.5 రేటింగ్స్ ఇచ్చారు. అవి చూసి నేను నిరాశ చెందలేదు. ఎందుకంటే.. మూవీపై నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అన్నయ్య సినిమాల మాదిరే మాస్ మసాలా అన్ని కలిపి ఇచ్చాము. పెద్ద హిట్ చేశారు. ఇక్కడ జోక్ ఏంటంటే.. వాళ్ళిచ్చింది 2.25 రేటింగ్స్ కాదు.. 2.25, 2.5 మిలియన్ డాలర్స్ అని తర్వాత అర్థమైంది” అని నవ్వుతూ స్వీట్ కౌంటర్ వేశారు. ప్రెజెంట్ ఈ వ్యాఖ్యలు మెగాఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. వీరయ్య సినిమాకి తెలుగు రాష్ట్రాలలో బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. చిరంజీవితో పాటు ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ, బాబీ సింహా, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్స్ తో పాటు దేవిశ్రీ సాంగ్స్, ఎమోషన్స్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ మెగా ఎంటర్టైనర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Rating 2.25 = 2.5 $ USA
2.25 = 200 cr Gross worldwide still countingUNDISPUTED KING OF INDIAN CINEMA MEGA🌟 @KChiruTweets 👑
Congratulations team #WaltairVeerayya
#BlockbusterWaltairVeerayya #Chiranjeevi #MegaStarChiranjeevi pic.twitter.com/bc1hCBygNA
— Shiva Roy (@ShivARoyal22) January 23, 2023