టాలీవుడ్ లో స్టార్ హీరోల ప్రస్తావన వస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కచ్చితంగా ఉంటారు. ఈ ఇద్దరూ కూడా నాలుగు దశాబ్దాలకు పైగా సినిమాలు చేస్తున్నారు. ఎంతో సక్సెస్స్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నాడు. తరాలు మారిన.. ఎందరో కుర్రహీరోలు వచ్చినా సరే.. ఇప్పటికీ వాళ్లకు పోటీఇచ్చేలా సినిమాలు తీస్తున్నారు. వచ్చే సంక్రాంతికి కూడా మిగతా హీరోలు పోటీలో లేరు. చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఒక్కసారి ఊహించుకోండి. ఇద్దరు వేర్వేరుగా వస్తేనే బాక్సాఫీస్ బద్దలైపోతుంది. అదే వీరిద్దరూ కలిసి మల్టీసారర్ చేస్తే.. మాస్ ఆడియెన్స్ కి ఫుల్ కిక్ గ్యారంటీ.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలయ్య, చిరు, ఇద్దరూ కూడా డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఎప్పుడూ ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. దాదాపు ఒకే టైంలో కెరీర్ స్టార్ట్ చేసిన వీళ్లిద్దరి మధ్య.. చాలాసార్లు పోటీ ఉండనే ఉంది. ఇప్పుడు రాబోయే సంక్రాంతికి కూడా చిరు-బాలయ్యనే బాక్సాఫీస్ దగ్గర తలపడనున్నారు. అలాంటిది ఈ ఇద్దరిని పెట్టి మల్టీస్టారర్ తీయడం అంటే సాహసమే. కానీ గతంలో ఆ ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లోనే కోదండరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు లాంటి వాళ్లు.. చిరు-బాలయ్యతో కలిసి సినిమా చేద్దామని అనుకున్నారట. కానీ అవి పలు కారణాలతో సెట్ కాలేదని తెలుస్తోంది.
ఇప్పుడు మాత్రం వాటితో సంబంధం లేకుండా కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు ‘అన్ స్టాపబుల్ 2’ చేస్తున్న బాలయ్య.. తాజాగా ఐదో ఎపిసోడ్ కోసం, స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, డి.సురేశ్ బాబులతో ముచ్చటించాడు. ఈ క్రమంలోనే హోస్ట్ బాలయ్య మాట్లాడుతూ.. ‘మన కాంబినేషన్ ఎప్పుడు?’ అని అల్లు అరవింద్ అని అడిగారు. ‘మీరు, చిరంజీవితో కలిపి కాంబినేషన్ లో తీద్దామని వెయిట్ చేస్తున్నాను’ అని అల్లు అరవింద్ సమాధానమిచ్చారు. దీంతో అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందని బాలయ్య.. ఇంకాస్త హైప్ పెంచేశారు. అయితే ఈ కాంబినేషన్ సెట్ అయినా సరే దాన్ని డీల్ చేయగలిగే డైరెక్టర్ ఎవరా అనేది బిగ్ క్వశ్చన్ లా కనిపిస్తుంది? చూడాలి మరి చిరు-బాలయ్య కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో? మీలో ఎంతమంది చిరు-బాలయ్య కలిసి సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.