చిరంజీవి ఒక లెజెండ్. బలగం సినిమా హిట్ అయితే తన సినిమా హిట్ అయినంతగా మురిసిపోతున్నారు. వేణుని, బలగం సినిమా నటీనటులను అభినందించకుండా ఉండలేకపోయారు చిరంజీవి. బలగం సినిమా హిట్ అయితే చిరంజీవికి ఎందుకింత ఆనందం?
మెగాస్టార్ చిరంజీవి అంటే అందరివాడు, అందరికీ కావాల్సిన వాడు, అందరూ కావాలనుకునే హీరో, అందరూ తనవాళ్లు అనుకునే హీరో. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా బాగుండాలి అని కోరుకునే మనిషి. అన్ని సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుందని నమ్మే వ్యక్తి. నిజానికి చిరంజీవికి ఉన్న స్టార్ స్టేటస్ కి తన సినిమాలు తాను చేసుకుంటూ.. చూసుకుంటూ ఉంటే చాలు. పక్క సినిమాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇండస్ట్రీ పెద్దగా అన్నీ పట్టించుకుంటారు. చిన్న సినిమా ఏదైనా రిలీజ్ అయితే సపోర్ట్ చేస్తారు. అక్కడితో అయిపోయిందా? ఆ చిన్న సినిమా హిట్ అయితే తన సినిమా హిట్ అయ్యిందన్న భావనతో ఉప్పొంగిపోతారు. బలగం సినిమా ఇవాళ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చింది. నిజానికి 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో చిరంజీవి చూడని హిట్లు లేవు. సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు చిరంజీవి ఎన్నో చూశారు. బలగం కంటే ముందు ఎన్నో హిట్లు వచ్చాయి. కానీ చిరంజీవి ప్రత్యేకించి బలగం సినిమాని ప్రశంసించడం పట్ల ఆయన వ్యక్తిత్త్వం ఎంత గొప్పదో తెలుస్తుంది. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ షూటింగ్ లో ఉన్నారు. ఇటీవలే బలగం సినిమాని చూసిన చిరంజీవి.. భోళా శంకర్ సెట్స్ లో బలగం చిత్ర బృందంతో సందడి చేశారు. వారిని అభినందించి సన్మానం చేశారు. అంత మంచి సినిమా తీసి మాకు షాకిస్తే ఎలా అంటూ వేణుని ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణ సంస్కృతిని బాగా చూపించావంటూ పొగిడేశారు. వేణుకి చిరంజీవి శాలువా కప్పి సన్మానం చేశారు. టీమ్ అందరినీ మంచి సినిమా తీశావంటూ పొగిడేశారు.
నిజానికి చిరంజీవికి ఏమవసరం? ఒక స్టార్ అయి ఉండి చిన్న సినిమాలను, వేణు లాంటి కమెడియన్స్ ని పట్టించుకోకపోతే ఎవరైనా అడుగుతారా? కానీ చిరంజీవి వ్యక్తిత్వం అది కాదు. నా సినిమా కాదు, మా మనుషులు కాదు అని సైలెంట్ గా ఉండలేరు. ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అని, ఇండస్ట్రీలో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యులని ఫీలవుతారు. అందుకే ఎవరికి ఏ చిన్న సక్సెస్ వచ్చినా తనకు వచ్చినట్టే ఫీలవుతారు. తన ఇంట్లో సొంత పిల్లలకు సక్సెస్ వచ్చినట్టే మురిసిపోతారు. చిన్న పిల్లాడిలా ఎగిరి గంతులు వేస్తారు. అదే చిరంజీవి. తోటి నటుల్లో తనను తాను చూసుకుంటారు. తాను ఎలా అయితే కింద నుంచి పైకొచ్చారో అలా ఎవరైనా వస్తే అభినందించకుండా ఉండలేరు. బలగం హిట్ అయితే చిరుకి ఎందుకు ఇంత ఆనందం అంటే.. వేణులో తనను తాను చూసుకున్నారు. అందుకే ఆ సినిమా విజయాన్ని తన విజయంగా భావించారు. మరి చిరంజీవి బలగం సినిమా బృందాన్ని అభినందించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
A mega moment for team #Balagam!
Thank you megastar @KChiruTweets Garu for your kind words! This means the world to us❤❤@OfflVenu @priyadarshi_i @KavyaKalyanram @dopvenu @LyricsShyam #BheemsCeciroleo @DilRajuProdctns @HR_3555 #HanshithaReddy @adityamusic @vamsikaka pic.twitter.com/piPOsVan5K
— Dil Raju Productions (@DilRajuProdctns) March 11, 2023