రాజకీయాలకు, సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. అదీకాక సినిమాల్లో రాణించిన కొందరు దిగ్గజాలు.. రాజకీయాల్లో సైతం తమదైన ముద్ర వేసిన చరిత్ర మనందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం కొందరు యంగ్ హీరోలు సైతం రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు కూడా. అయితే రాజకీయాలు-సినీ పరిశ్రమకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. ఎన్టీఆర్, ఎంజీఆర్ ల నుంచి ఈ అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన రెండు భేటీలు అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. ఒకటి ఆదివారం జరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్-చంద్రబాబు నాయుడు భేటీ అయితే.. మరోటి సూపర్ స్టార్ రజినీకాంత్-చంద్రబాబు నాయుడు భేటీ. చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ లో రజినీతో దిగిన ఫోటోను షేర్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
సూపర్ స్టార్ రజినీకాంత్.. వరల్డ్ వైడ్ గా గుర్తింపు దక్కించుకున్న హీరో. హాలీవుడ్ హీరోలకు ఉన్నంత క్రేజ్ సూపర్ స్టార్ సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం రజినీకాంత్ కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటో. ప్రస్తుతం జైలర్ షూటింగ్ నిమిత్తం తలైవా హైదరాబాద్ వచ్చారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ అయిపోయాక మర్యాదపూర్వకంగా వెళ్లి చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. రజినీకాంత్ కు శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. అనంతరం కొద్దిసేపు ముచ్చటించుకున్నట్లు సమాచారం. ఈ పిక్ ను చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
It was a pleasure to meet and interact with my dear friend ‘Thalaivar’ @rajinikanth today! pic.twitter.com/b8j1BxICEF
— N Chandrababu Naidu (@ncbn) January 9, 2023
“నా ఆప్త మిత్రుడు తలైవా రజినీకాంత్ ను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ రాసుకొచ్చారు చంద్రబాబు. ప్రస్తుతం ఈ పిక్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి చంద్రబాబు-రజినీకాంత్ ల మధ్య అనుబంధం ఉంది. సూపర్ స్టార్ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గురించి పలు వేడుకల్లో వెల్లడించారు కూడా. ఆ అనుబంధంతోనే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తలైవా చంద్రబాబును కలిసి వెళ్తుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు కూడా చంద్రబాబును కలిశారు సూపర్ స్టార్. ఇక త్వరలోనే ‘జైలర్’ మూవీతో ప్రేక్షకులను అలరించబోతున్నారు రజినీకాంత్.