టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. తన డాన్స్ లతోనే కాకుండా నటనలోనూ తనకు సాటిరారంటూ తన సత్తాను చాటుతున్నాడు. గంగోత్రి సినిమాతో నటుడిగా కెరియర్ ప్రారంభించిన బన్నీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. దీంతో బన్నీకి టాలీవుడ్ లోనే కాకుండా తమిళ్, మలయాళంలోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నాడు.
ఇక వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియాలో సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్ శర వేగంగా జరుపుకుంటోంది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక దీంతో పాటు ఈ సినిమాలో నటిస్తూనే మరో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు అల్లు అర్జున్. టాలీవుడ్ లో జెర్సీ మూవీని తెరకెక్కించి మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు గౌతమ్ తిన్ననూరి.
ఈ సినిమాతో గౌతమ్ తన సత్తాను చాటాడనే చెప్పాలి. కాగా తర్వాత సినిమా బన్నీతోనే చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు జోరందుకున్నాయి. తాజాగా ఈ డైరెక్టర్ అల్లు అర్జున్ కి ఓ కథ చెప్పడంతో దీనికి బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తరువాత గౌతమ్ తోనే సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ యంగ్ డైరెక్టర్ తో బన్నీ నిజంగానే మూవీ చేస్తాడా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.