ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. వరుస హిట్స్ లో ఉన్నా.. మార్కెట్ లో ఎక్కువగా వారి పేరు ట్రెండ్ అవుతున్నా.. అన్నింటికీ మించి యూత్ కి బాగా కనెక్ట్ అయిన హీరోయిన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు దర్శకనిర్మాతలు. ఈ విషయంలో యంగ్ బ్యూటీ శ్రీలీల చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. తన డాన్స్ లతోనే కాకుండా నటనలోనూ తనకు సాటిరారంటూ తన సత్తాను చాటుతున్నాడు. గంగోత్రి సినిమాతో నటుడిగా కెరియర్ ప్రారంభించిన బన్నీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. దీంతో బన్నీకి టాలీవుడ్ లోనే కాకుండా తమిళ్, మలయాళంలోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నాడు. ఇక వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు అల్లు […]