నందమూరి బాలకృష్ణ.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు ఎంత ప్రత్యేకమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డబ్బులో పుట్టి, డబ్బులో పెరిగిన వ్యక్తి బాలయ్య. రాష్ట్ర రాజకీయాన్ని శాశించిన మహోన్నత వ్యక్తికి వారసుడు. 4 దశాబ్దాలుగా అగ్ర హీరో. మాజీ ముఖ్యమంత్రికి వియ్యంకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే. ఇదీ బాలయ్య బయోగ్రఫీ. ఇంత స్థాయి ఉన్నా, సాదాసీదా జీవితం గడపడం బాలకృష్ణకి అలవాటు.
బాలయ్య లగ్జరీ కార్స్, స్పోర్ట్స్ బైక్స్ అంటూ ఆయన ఎప్పుడూ హడావిడి చేసింది లేదు. ఆయనది అంతా సింపుల్ లైఫ్ స్టయిల్. అయితే.. రీసెంట్ గా జరిగిన “అన్ స్టాపబుల్” ఈవెంట్ కి బాలయ్య ఓ సూపర్ లగ్జరీ కార్ లో ఎంట్రీ ఇచ్చారు. దీంతో.. ఇప్పుడు ఈ కార్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.
సినిమాలతో, రాజకీయాలతో, బసవతారకం హాస్పిటల్ పనులతో బిజీగా ఉండటం మాత్రమే బాలకృష్ణ తెలుసు. అలాంటి బాలయ్య ఇంతటి లగ్జరీ కార్ ఎప్పుడు కొన్నారన్న అన్న చర్చ భారీగా నడిచింది. అయితే.., తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా బ్రాహ్మణి ఈ బెంట్లీ కారుని గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని ఖరీదు దాదాపు 4 కోట్ల నుంచి 4.5 కోట్లు వరకు ఉంటుందని అంచనా. కారు మార్చమని కుటుంబ సభ్యులు చాలా ఏళ్లుగా చెప్తున్నా బాలయ్య వారి మాటలను పట్టించుకోలేదట. దీంతో.. ఇక ఆయన లగ్జరీ కారు కొనరని అర్ధం చేసుకున్న బ్రాహ్మణి తండ్రికి ఇంత కాస్ట్లీ కార్ గిఫ్ట్ గా ఇచ్చినట్టు సమాచారం. మరి.. బాలయ్య కొత్త కారు ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.