సినిమా రంగంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై తరచూ వివిధ రకాల ఆరోపణలు వింటునే ఉంటాం. అయితే ఇది అనాదిగా ఉన్నదే. ప్రతి స్టార్ హీరోయిన్ దాదాపుగా ఇలాంటి దశను దాటి వచ్చిన పరిస్థితి. బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్‌కు సైతం ఇదే అవమానం. నొప్పితో విలవిల్లాడుతున్నా వదల్లేదట. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు చేదు అనుభవాలు, అవమానకర సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. లైంగిక వేధింపులు కూడా తప్పవు. దీనికి ఎవ్వరూ అతీతం కాదు. ఆఖరికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు కూడా తప్పలేదంట. అది కూడా ఈ స్టార్ హీరోయిన్ మైనర్ బాలికగా ఉన్నప్పుడే అప్పటి హీరోలు ఆమెపై దాడి చేశారు. నొప్పితో విలవిల్లాడుతున్నా వదల్లేదట. హీరో ఆ పని చేస్తుంటే దర్శకుడు చోద్యం చూస్తుండిపోయాడు.
సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కలలతో అడుగుపెట్టిన ఆ 15 ఏళ్ల బాలికకు కెరీర్ ప్రారంభంలోనే అత్యంత చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ సెట్‌లో అందరూ చూస్తుండగానే అప్పటి హీరో బలవంతంగా లిప్ కిస్ పెట్టాడు. అది కూడా ఏకధాటిగా ఐదు నిమిషాల సేపు. డైరెక్టర్ మాత్రం కట్ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఇది జరిగింది 1969లో. అంజానా సఫర్ షూటింగ్ సమయంలో. బాలీవుడ్ మేటి స్టార్ నటి వయసు అప్పుడు 15 ఏళ్లు మాత్రమే. ఆ హీరో బిశ్వజిత్ ఛటర్జీ. దర్శకుడు రాజా నవా.
ఏం జరిగింది
హీరోయిన్‌కు చెప్పకుండానే ఈ సినిమాలో చిత్ర యూనిట్ లిప్ కిస్ ప్లాన్ చేసింది. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే అక్కడున్న హీరో బిశ్వజిత్ ఆమెను గట్టిగా పట్టుకుని లిప్ లాక్ చేశాడు. ఇలా ఐదు నిమిషాలు పెడుతూనే ఉన్నాడు. కెమేరా రోల్ అవుతూనే ఉంది. సెట్‌లోని ఇతర సిబ్బంది ఈలలు, చప్పట్లతో ఈ లిప్ లాక్ సీన్‌ను ఇంకా ప్రోత్సహించారు. ఊహించని హఠాత్ పరిణామానికి ఆ బాలిక విగ్రహంలా మారిపోయింది. కంటి నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఈ ఘటనతో ఆమె మానసికంగా కృంగిపోయింది. యాసిర్ ఉస్మాన్ రాసిన బయోగ్రఫీలో ఇదంతా రాసుకొచ్చింది ఆ స్టార్ హీరోయిన్. ఆ సిన్ పూర్తయ్యాక ఏడుస్తూ ఉండిపోయిందట. తనను దారుణంగా మోసం చేశారంటూ కోపంతో రగిలిపోయింది. ఆ గాయం ఎప్పటికీ మానదంటోంది ఆ హీరోయిన్. ఆ తరువాత తానెంత ఎదిగినా, ఎన్ని అవార్డులు వచ్చినా, ఎన్ని సినిమాలు చేసినా మానసిక వేదన మర్చిపోలేనంటోంది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు
90 దశకం వరకూ బాలీవుడ్‌ను ఊపు ఊపిన స్టార్ నటి రేఖకు ఎదురైన చేదు అనుభవమిది. ఇంత జరిగినా ఆ హీరోకు లేదా డైరెక్టర్‌కు పశ్చాత్తాపం లేదు. ఆ సినిమాకు లిప్ లాక్ సీన్ అవసరమని, డైరెక్టర్ చెప్పడంతోనే చేశానని హీరో చెప్పుకొచ్చాడు. కిస్సింగ్ సీన్ గురించి రేఖకు ముందే తెలుసని, పబ్లిసిటీ కోసం తాము అలా చెప్పమనడంతోనే చెప్పిందని నిర్మాత అంటున్నాడు.
రేఖను ఇంతగా ఇబ్బంది పెట్టిన ఆ సినిమా సెన్సార్ సమస్యలతో పదేళ్లు ఆగిపోయింది. 1979లో దో షికారి పేరుతో విడుదలైంది. వివాదాస్పదంగా మారిన ఆ కిస్సింగ్ సీన్ మాత్రం సినిమా నుంచి తొలగించారు. రేఖ వంటి స్టార్ హోదా కలిగిన హీరోయిన్‌కే ఇలాంటివి తప్పలేదన్నమాట.