తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే సామెత వినే ఉంటారు. ఈ సామెతను నూటికి నూరుపాళ్లూ పాటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఏకంగా ప్రియురాలికి ఇంటిని అద్దెకివ్వడమే కాకుండా నెలనెలా వసూలు చేస్తున్నాడట. ఆశ్చర్యంగా ఉందా..వాచ్ ద స్టోరీ
సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఎంత ఉంటుందో ఆదాయం కూడా అంతే ఉంటుంది. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునేందుకు కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇతర రంగాల్లో పెట్టుబడి పెడుతుంటారు. స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయడం, అద్దెకిచ్చి కోట్లు గడించడం చేస్తుంటారు. ముంబైలో బాలీవుడ్ నటుల సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అద్దె అడుగుకి ఇంతని ఉంటుంది. ఈ స్టార్ హీరో కూడా అదే పనిచేస్తున్నాడు. అందరూ చేసేదే కదా ఇందులో ఆశ్చర్యమేముందని అనుకుంటున్నారా..కచ్చితంగా ఉంది.
ఈ బాలీవుడ్ స్టార్ హీరో ముంబైలోని జుహూ సముద్రతీరానికి ఆనుకుని ఉన్న లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను ఏకంగా తన ప్రేయసికే అద్దెకిచ్చాడు. నెలకు 75 వేల అద్దె కూడా వసూలు చేస్తున్నాడట. పైగా రెంటల్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నాడు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు బిజినెస్ బిజినెస్సే అంటున్నారు ఈ హీరో. ప్రేమ వేరు..వ్యాపారం వేరని చెబుతున్నాడు. ఇంతకీ ఈ స్టార్ నటుడు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ నటుడు, వార్ 2తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హృతిక్ రోషన్. ఆ ప్రేయసి పేరు సబా ఆజాద్. ఈమె కేవలం ప్రేయసి మాత్రమే కాదు, ఎక్కువగా ఆమెతనే కలిసి ఉంటున్నాడు. సబా ఈ అపార్ట్‌మెంట్‌ను తన వర్క్ పర్పస్ కోసం వినియోగిస్తోందట.
భార్య సుసానే ఖాన్‌తో విడాకుల తరువాత హృతిక్ రోషన్ సబా ఆజాద్‌తో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో ఈ ఇద్దరి ప్రేమబంధం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడీ అపార్ట్‌మెంట్ అద్దె వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.