బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకుని 15వ సీజన్ మొదలు పెట్టింది. హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్లో అపశృతి చోటు చేసుకుంది. టాస్క్‌లో ఓడిపోయినందుకు బిగ్‌బాస్ కంటెస్టెంట్ అఫ్సానా ఖాన్ ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటనతో అక్కడున్న మిగతా ఇంటి సభ్యులు షాక్ తిన్నారు. వెంటనే తేరుకొని ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 15 షోలో అఫ్సానా ఖాన్ కంటెస్టెంట్‌గా రాణిస్తున్నారు. వీఐపీలను కలిసే టాస్క్‌ను ఇటీవల ఇంటిలో నిర్వహించారు. టాస్క్ ప్రకారం కంటెస్టెంట్స్ లో కరణ్ కుంద్రా, నిషాంత్ భట్, తేజస్వి ప్రకాశ్, అఫ్సానా ఖాన్లలో ముగ్గురిని మాత్రమే వీఐపీ టికెట్ కోసం ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే రియాజ్.. అఫ్సానా ఖాన్‌ను ఈ రేసు నుంచి తప్పించి మిగిలిన ముగ్గురిని సెలక్ట్ చేశాడు. ఇది అందరూ కావాలనే చేస్తున్నారని.. అందరూ తనను టార్గెట్ చేస్తున్నారని, నమ్మిన స్నేహితులే వెన్నుపోటు పొడుస్తున్నారని సీరియస్ అయింది అఫ్సానా.
ఒకపక్క అరుస్తూనే వెంటనే అక్కడున్న కత్తిని తీసుకొని చెయ్యి కోసుకోడానికి ప్రయత్నించింది. పక్కనే ఉన్న రియాజ్, కరణ్ ఇది చూసి వెంటనే ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. వెంటనే అలెర్ట్ అయిన రియాజ్, కరణ్ ఆమెను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కత్తితో తనకు తాను గాయపరుచుకొని ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించడంపై బిగ్‌బాస్ తీవ్రంగా స్పందించారు. తనపై నియంత్రణను కోల్పోయి స్వయంగా గాయపరుచుకోవడం గేమ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ నిర్వాహకులు కంటెస్టెంట్‌ను షో నుంచి ఎలిమినేట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
