సినిమా హీరోలు వెండితెరపై తమ హీరోయిజం చూపిస్తూ ఎంతో మందిని ఆదుకుంటారు.. విలన్ల భరతం పడుతుంటారు. కానీ కొంత మంది హీరోలు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తమ మంచితనాన్ని చాటుకుంటారు.. అలాంటి వారిలో నందమూ బాలకృష్ణ ఒకరు.
తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించకున్నారు నందమూరి బాలకృష్ణ. హీరోగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యే ప్రజా సేవ చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఎవరైనా ఆపదలో ఉంటే వారికి నేనున్నాననంటూ భరోసా ఇస్తారు.. ఆర్ధికంగా అండగా నిలుస్తుంటారు బాలయ్య. తన తల్లిపేరుపై నెలకొల్పిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి అధినేతగా ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు ఆపన్నహస్తం అందించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. అంతేకాదు పేదలకు సొంత ఖర్చుతో ఆస్పత్రి బిల్లులు కూడా స్వయంగా చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ని ఆదుకొని మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు బాలయ్య.
సీనియర్ ఎన్టీఆర్ సతీమణి.. నందమూరి బాలకృష్ణ తల్లి కాన్సర్ వ్యాధితో మరణించారు. తన తల్లిలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఉద్దేశ్యంతో బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించారు. క్యాన్సర్ తో బాధపడే వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ వద్ద అసిస్టెంటెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నా మహేష్ యాదవ్. గతంలో రామ్ చరణ్ నటించి వినయవిధేయ రామ, అఖండ చిత్రాలకు బోయపాటి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతుంటై వైద్యం చేయించారు.. మహేష్ యాదవ్ కి బ్రెయిన్ ట్యూమర్ అని వైద్యులు నిర్ధారించారు. ఇందుకోసం 40 లక్షల వరకు వైద్య ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.
ఈ విషయం బోయపాటి శ్రీనివాస్ ద్వారా బాలకృష్ణ తెలుసుకున్నారు. బాలకృష్ణ తన సొంత ఖర్చుతో మహేష్ యాదవ్ కి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ లో చేర్పించి ఉచితంగా వైద్యం చేపించారట. మహేష్ యాదవ్ కి మెరుగైన చికిత్స అందిందని.. త్వరలో అతడు మంచి ఆరోగ్యంతో తిరిగి వస్తారని వైద్యులు తెలిపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో తమ హీరో బాలకృష్ణ మనసు బంగారం అంటూ ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు.. జై బాలయ్య అంటూ ప్రశంసిస్తున్నారు. గతంలో కూడా బాలకృష్ణ క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమానులను స్వయంగా కలిసి వారికి తన సొంత ఖర్చులతో మెరుగైన చికిత్స అందేలా చేశారు.
ఈ మద్యనే రామ్ చరణ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తొమ్మిదేళ్ల మణి కుశాల్ ని కలిసి సంతోషపెట్టాడు. తన చిన్నారి అభిమానిని కలిసేందుకు హైదరాబాద్ స్పర్శ్ హాస్పిస్ ఆసుపత్రికి వెళ్ళారు. ఆ చిన్నారికి ఎంతో ధైర్యాన్ని ఇవ్వడమే కాదు మంచి బహుబతి కూడా ఇచ్చాడు. తాను ఎంతో అభిమానించే హీరో రామ్ చరణ్ ని చూసిన మణి కుశాల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక మహేష్ బాబు ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి వారి పునఃజన్మనిస్తున్నారు. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు క్యాన్సర్ తో బాధపడుతున్న తమ అభిమానుల కోసం స్వయంగా వారి వద్దకు వెళ్లి ధైర్యం చెబుతుంటారు.