నాన్న పనిచేసే చోటికి ఒకసారైనా వెళ్లాలని, ఆఫీస్ లో నాన్న చేసే పని చూడాలని చాలా మంది పిల్లలకి అనిపిస్తుంది. పిల్లలకే కాదు వారి తల్లికి కూడా తన భర్త చేసే పని చూడాలని అనిపిస్తుంది. అయిపోతే కొంతమందికే ఆ అవకాశం ఉంటుంది. అలా వారు ఆ అవకాశం దొరికినప్పుడు ఆఫీస్ కి వెళ్లి.. అక్కడ భర్త పనోడుతనాన్ని తోటి ఉద్యోగులు, బాస్ పొగుడుతుంటే ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేనంత విలువైనదిగా ఉంటుంది. ఇలా అనుభూతి చెందాలని సామాన్య ప్రజలకే కాదు, సెలబ్రిటీల కుటుంబ సభ్యులకు కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా హీరోల విషయంలో తమ కుటుంబ సభ్యులు.. లైవ్ లో షూటింగ్ జరుగుతుంటే చూడాలనుకుంటారు. నాన్న హీరోలా రౌడీలను కొడుతుంటే చూడాలని పిల్లలు తెగ ఆరాటపడుతుంటారు.
ఈ క్రమంలో షూటింగ్ లొకేషన్ కి వెళ్ళిపోయి తమ సరదా తీర్చేసుకుంటారు. ఈ తరహాలోనే నందమూరి బాలకృష్ణ పిల్లలు కూడా తమ తండ్రిని చూసేందుకు షూటింగ్ లొకేషన్ కి వెళ్లారు. అది 2001వ సంవత్సరం. అప్పుడు నరసింహనాయుడు మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీలో హీరో గతాన్ని మర్చిపోయి.. సీమకి దూరంగా ప్రశాంతంగా ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని క్లాసికల్ డాన్స్ మాస్టర్ గా జీవిస్తుంటాడు. ఆ డాన్స్ మాస్టర్ గెటప్ లోనే బాలయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రమం బ్యాక్ గ్రౌండ్ లో ఫోటో దిగారు. బాలకృష్ణ, సతీమణి వసుంధర దేవి.. వీరి పిల్లలు బ్రాహ్మణి, తేజశ్విని, మోక్షజ్ఞ తేజ కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. 21 ఏళ్ళ నాటి ఫోటోలో బాలయ్య పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు. మోక్షజ్ఞ తేజ అయితే భలే ముద్దొస్తున్నాడు.
ఈ ఫోటో చూస్తుంటే.. తమ తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటో జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. ఒకసారి మళ్ళీ మన ఫోటోలు చూసుకోవాలి అని అనిపిస్తుంది. అంత చూడముచ్చటగా ఉంది ఈ కుటుంబ చిత్రం. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య.. ఒక పక్క అన్ స్టాపబుల్ షోతో రచ్చ చేస్తూనే.. మరోపక్క గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీర సింహారెడ్డి’ మూవీలో నటిస్తున్నారు. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీలో బాలయ్య లుక్ మాత్రం అదిరిపోయింది. 108వ చిత్రంగా అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయబోతున్నారు. మొత్తానికి బాలయ్య ఏం చేసినా అన్ స్టాపబుల్ అనిపించుకుంటున్నారు.