ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై కర్ణాటకలో కొందరు యువకులు రాళ్లతో దాడి చేశారు. బళ్లారిలో ఓ ప్రోగ్రామ్ కు హాజరైన ఆమె తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. అయితే దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను రక్షించి సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు. తాజాగా మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరగడం తీవ్ర కలకలంగా మారింది. ఆ యువకులు ఎందుకు మంగ్లీ కారుపై రాళ్ల దాడి చేశారు? అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ ప్రముఖ సింగర్ మంగ్లీ ఇటీవల కర్ణాటక బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫేస్టివల్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ యాక్టర్ రాఘవేంద్ర కుమార్ తో పాటు పునిత్ రాజ్ కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంగ్లీతో పలువురు సింగర్స్ పాల్గొని పాటలు పాడారు. ఇక ఈ ప్రోగ్రామ్ అనంతరం మంగ్లీని చూసేందుకు చాలా మంది యువకులు మేకప్ టెంట్ లోకి దూసుకెళ్లారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ యువకులను అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో ఆ యువకులు మంగ్లీ కారు వెళ్తుండగా ఆమె కారుకు ఎదురెళ్లారు.
దీంతో పోలీసులు ఆ యువకులను మరోసారి అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, యువకుల మధ్య తోపులాట జరిగినట్లు సమాచారం. దీంతో ఆ యువకులు కోపంతో సింగర్ మంగ్లీ కారుపై రాళ్లతో దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కన్నడ ప్రముఖ యాంకర్ మంగ్లీని కన్నడలో మాట్లాడాలని సూచించారట. రెండు మూడు మాటలు మాటలు మాట్లాడి.. అందరికీ తెలుగు వస్తుందని ఆమె మాట్లాడలేదని సమచారం. ఈ రెండు కారణాలతోనే ఆమెపై రాళ్లదాడి జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Miscreants pelted stones at singer Mangli’s car : ಗಾಯಕಿ ಮಂಗ್ಲಿ ಕಾರಿಗೆ ಕಲ್ಲೆಸೆದ ಪುಂಡರು#mangli #singermangli #karnatakanews #karnatakalatestnews pic.twitter.com/h1tKfUR2lD
— Karnataka Tak (@karnataka_tak) January 22, 2023