అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవర కొండ స్టార్ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన కంటూ ఫ్యాన్స్ బేస్ ఏర్పడిందీ ఈ సినిమాతోనే. ఈ సినిమాలో నటించిన ప్రతీ పాత్రకు పేరు వచ్చింది. డైరెక్టర్ల నుండి టెక్నీషియన్ వరకు మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా మంచి వసూళ్లను కూడా రాబట్టుకుంది. ఈ సినిమాను తమిళంలోనూ, అటు హిందీలోనూ రీమేక్ చేశారు. తమిళంలో విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా నటించగా, హిందీలో షాహీద్ కపూర్ హీరోగా తెరకెక్కింది. తమిళంతో పోలిస్తే.. హిందీలోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగు సినిమాను చూసిన వాళ్లు కూడా హిందీలోనూ చూసి ఆనందించారు. హిందీలో సుమారు 100 కోట్లకు పైగా వసూలు చేసిందీ ఈ సినిమా.
అయితే ఈ సినిమాలో ఫన్ పండించే పాత్ర ఉందంటే అది పనిమనిషి పాత్రే. హిందీలో ఈ పాత్ర చేసిన నటి వనితా కారత్ కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇటీవల తన స్నేహితుడితో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతుంది. దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. కాగా మెహందీ, మంగళ స్నానాలు, ఇతర వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియలో పంచుకుంటున్నారు. ఇందులో సంప్రదాయ వస్త్రధారణలతో ఆమె మెరిసిపోతున్నారు. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు.