ప్రముఖ కమెడీయన్, ఏపీ ప్రభుత్వ సలహాదారుడు (ఎలక్ట్రానిక్ మీడియా) అలీ పెద్ద కుమార్తె ఫాతిమా రమీజున్ వివాహం సోమవారం రాత్రి హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసింది. ఈ వివాహ వేడుకకి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, కింగ్ నాగార్జున,అమల దంపతులు హాజరయ్యారు. అలానే మంత్రి రోజా కూడా అలీ కుమార్తె వివాహానికి హాజరై..వధువరులను ఆశీర్వదించారు. వీరితో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పెళ్లికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. అయితే మంగళవారం సాయంత్రం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని శ్రీకన్వెన్షన్ లో అలీ కుమార్తె రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.