యాంకర్ సుమ.. దక్షిణాది బుల్లితెరపై యాంకరింగ్ లో లెజెండ్ అనే చెప్పాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా, టీవీ షో అయినా సినిమాకు సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా యాంకర్ గా సుమ ఉండాల్సిందే. తన వాగ్ధాటితో, టైమ్ కు తగ్గ పంచ్ లతో కామెడీ చేస్తూ హీరో, హీరోయిన్లను సైతం ఓ ఆట ఆడుకుంటూ తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే సుమ కనకాల జయమ్మ పంచాయితీ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్ర పోషించినట్లు ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల మందుకు వచ్చింది. దీంతో ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమకు ఓ సూటి ప్రశ్న ఎదురైంది.
ఇది కూాడా చదవండి: Bhuvan Gowda: అలా అయితే నేను సూసైడ్ చేసుకుంటా: KGF కెమెరా మెన్
సినిమాల్లో బిజీగా మారిపోతున్నారు, ఇక యాంకరింగ్ కు గుడ్ బై చెప్తారా? అని విలేకరి అడగగా.. అయ్యయ్యో అలాంటిదేం లేదు. నన్ను ఇక్కడి వరకు నిలబెట్టింది యాంకరింగే, దానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ సుమ క్లారిటీ ఇచ్చారు. బుల్లితెర నాకు అన్నం పెట్టింది, దానిని ఎలా వదులకుంటా అంటూ సుమ తెలిపింది. సమ ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.