ఆడియన్స్‌కి మోర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ.. ఎప్పటికప్పుడు సస్పెన్స్‌లో పడేస్తూ.. ఎంతగానో ఆకట్టుకునే వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’. తెలుగులో ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తవగా.. త్వరలో ‘బిగ్ బాస్ 7’ వ సీజన్ మొదలు కానుంది.
ఆడియన్స్‌కి మోర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ.. ఎప్పటికప్పుడు సస్పెన్స్‌లో పడేస్తూ.. ఎంతగానో ఆకట్టుకునే వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’. తెలుగులో ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తవగా.. త్వరలో ‘బిగ్ బాస్ 7’ వ సీజన్ మొదలు కానుంది. అక్టోబర్‌లో వరల్డ్ కప్ సీజన్ స్టార్ట్ కాబోతుండడంతో ఈ సీజన్ కాస్త ముందుగానే ప్రారంభించబోతున్నారు. ఇక ప్రోమో క్యాప్షన్‌లో.. ‘మీకు తెలిసింది, ఇంతకుముందు జరిగింది, మీరనుకునేది కాకుండా టోటల్‌గా అంతా మార్చబోతున్నాం. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చెయ్యడానికి రెడీగా ఉండండి’ అంటూ ‘కుడి ఎడమైతే’ ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో హింట్ ఇచ్చారు. అలాగే ఈసారి హౌస్ కూడా కంప్లీట్ డిఫరెంట్‌గా ఉండబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
‘బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ బిబి హౌస్‌మెట్స్’ అంటూ ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో ప్రోమో రిలీజ్ చేశారు. ‘ఒకటి కాదు, రెండు కాదు.. బిగ్ బాస్‌లోని సిక్స్ సీజన్స్‌లో ఉన్న స్టార్స్ అందరూ ఒకే వేదిక మీద కనిపిస్తే ఎలా ఉంటుంది?’ అంటూ సుమతో స్టార్ట్ అయ్యింది ప్రోమో. ‘బేబి’, ‘స్లమ్ డాగ్ హస్బండ్’ సినిమాల టీంతో పాటు దర్శకులు అనిల్ రావిపూడి, మెహర్ రమేష్ కూడా సందడి చేశారు. ముద్దుగుమ్మలు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో అలరించారు. ‘నడిచొస్తే మాసు.. టోటల్‌గా మీ అందరి బాసు’ అనగానే.. మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ టైటిల్ సాంగ్‌కి స్టెప్పులేస్తూ కింగ్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ 7 టీజర్ చూసినప్పటి నుంచి అందరికీ ఉన్న ఒకే ఒక్క డౌట్ ‘కుడి ఎడమైతే’.. దీని గురించి సుమ అడగ్గా.. తన స్టైల్లో క్లారిటీ ఇచ్చారు నాగ్. ‘న్యూ రూల్స్, న్యూ ఛాలెంజెస్, న్యూ గేమ్’ అంటూ ఈసారి న్యూ సీజన్ ఎంత వైవిధ్యభరితంగా, ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుందనేది ప్రేక్షకుల అంచనాలకే వదిలేశారు. వచ్చే ఆదివారం (జూలై 30) సాయంత్రం 6 గంటలకు ఈ ‘షైనింగ్ స్టార్స్’ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ప్రోమోనే ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందంటే.. ఇక ఎపిసోడ్ ఓ రేంజ్‌లో ఉంటుందంటూ బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : ‘కుడి ఎడమైతే’.. బిగ్ బాస్ ప్రోమోలో ఇంత అర్ధం ఉందా? కాన్సెప్ట్ అదిరింది!