‘మీకు తెలిసింది, ఇంతకుముందు జరిగింది, మీరనుకునేది కాకుండా టోటల్‌గా అంతా మార్చబోతున్నాం. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చెయ్యడానికి రెడీగా ఉండండి’ అంటూ ‘కుడి ఎడమైతే’ ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో హింట్ ఇచ్చారు బిగ్ బాస్ టీమ్.
‘మీకు తెలిసింది, ఇంతకుముందు జరిగింది, మీరనుకునేది కాకుండా టోటల్‌గా అంతా మార్చబోతున్నాం. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చెయ్యడానికి రెడీగా ఉండండి’ అంటూ ‘కుడి ఎడమైతే’ ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో హింట్ ఇచ్చారు బిగ్ బాస్ టీం. తెలుగు రాష్ట్రాల్లో, సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 7 సందడి స్టార్ట్ అయిపోయింది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్. ‘బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ బిబి హౌస్‌మెట్స్’ అంటూ ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో ప్రోమో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఒకటి కాదు, రెండు కాదు.. బిగ్ బాస్‌లోని సిక్స్ సీజన్స్‌లో ఉన్న స్టార్స్ అందర్నీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి సందడి చెయ్యబోతున్నారు. అలాగే నాగ్, ‘కుడి ఎడమైతే’ అనే దానికి జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు.
రీసెంట్‌గా దాదాపు 7 నిమిషాల పాటు ఉన్న సాలిడ్ ప్రోమో ఒకటి రిలీజ్ చేసింది టీం. ఇది చూశాక.. 7వ సీజన్ కనుక ఇలా ఉంటే.. ఇదే హయ్యస్ట్ వ్యూస్ సాధించిన షోగా రికార్డ్ సెట్ చేస్తుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘బేబి’ టీమ్, ‘స్లమ్‌డాగ్ హస్బండ్’ టీమ్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్ కూడా వీరితో కలిసి సందడి చేశారు. ఇక ప్రోమో మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంది. ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశారు. సుమ హోస్ట్ చేస్తే ఎంత హంగామా ఉంటుందో తెలిసిందే. ‘బేబి’లో హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న మూడో వాడు ఎక్కడున్నాడని అడిగి షాక్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి : ‘బ్రో’ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా?
విరాజ్ అశ్విన్, సుమ మెడలో దండేసి, ఆమెతో కలిసి డ్యాన్స్ చేయడం ఎవరూ ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదసలు. ఇక తేజస్వి, మెహబూబా ఓ పాట చేశారు. అందులో తేజస్విని చూస్తే కుర్రాళ్లకి కిక్కే కిక్కు. ఇక కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాక ప్రోమో మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ‘స్లమ్‌డాగ్ హస్బండ్’ మూవీ హీరోయిన్ ప్రణవి మానుకొండ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లో తన పక్కన బాలనటిగా చేసిందని చెప్పగానే.. ఈ పిల్ల పెద్దగా అయిపోయింది కానీ మనమిద్దరం ఇంకా అలాగే ఉన్నామంటూ నవ్వించింది సుమ.
వైష్ణవి చైతన్య ‘మస్తిష్టం మీరు నాకు’ అంటే నాగ్ హగ్ ఇవ్వమన్నారు. ‘‘BB 7 టీజర్‌లో ‘కుడి ఎడమైతే’ అన్నారు. ఏంటి సార్?’’ అని సుమ అడిగింది. ‘ఓట్లు ఎలా కొట్టాలి, ఏంటి? అని కంప్లీట్ గేమ్ ప్లే అంతా మైండ్‌లో సెట్ చేసుకుని వస్తున్నారు. ఈసారి అవన్నీ కుదరవ్. చూడు ఒకసారి.. చూసిన తర్వాత మాట్లాడదాం’ అంటూ సీజన్ 7 ఎంత డిఫరెంట్‌గా, పార్టిసిపెంట్స్‌కి ఎంత టఫ్‌గా, ఆడియన్స్‌కి ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుందో చెప్పకనే చెప్తూ అంచనాలు అమాంతం పెంచేశారు నాగ్.