ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా బర్త్ డేలు, పెళ్లిళ్లు.. ఇతర వేడుకలన్నీ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. బర్త్ డేలు మొదలుకొని.. ఫంక్షన్స్, ఫ్యామిలీ ఈవెంట్స్ తో పాటు ఆఖరికి హోమ్ టూర్ వీడియోస్ అంటూ రచ్చ చేస్తున్నారు. అదీగాక ఎవరికి వారే సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని.. వీడియోలు పెడుతూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా యాంకర్ రవి తన వైఫ్ బర్త్ డేని సర్ప్రైజింగ్ గా ప్లాన్ చేశాడు.
యాంకర్ రవితో పాటు అతని భార్య నిత్యా, కూతురు వియా కూడా జనాలకు సుపరిచితమే. న్యూ ఇయర్ తర్వాత రవి తన కూతురితో కలిసి భార్య నిత్యా బర్త్ డేని.. అతి కొద్దిమంది ఫ్రెండ్స్, సన్నిహితులను పిలిచి చేశాడు. భార్య బర్త్ డే కోసం రవి.. షాద్ నగర్ లో బ్యాక్ యార్డ్ తోట అనే ఫామ్ హౌస్ ని బుక్ చేశానని చెప్పాడు. భార్యకి గుడికి వెళ్తున్నామని చెప్పి వచ్చామని.. అన్ని ఏర్పాట్లు చేశాక ఆమెను కూడా ఫామ్ హౌస్ కి రమ్మన్నామని చెప్పాడు. అయితే.. వీళ్ళు ఫామ్ హౌస్ లో ఉన్నారనే సంగతి నిత్యాకి తెలియదట. దీంతో కాసేపటికి రవి భార్య నిత్యా వచ్చి.. ఒక్కసారిగా అందరినీ చూసి సర్ప్రైజ్ అయిపోయింది.
ప్రస్తుతం యాంకర్ రవి తన భార్య నిత్యా బర్త్ డేని సెలబ్రేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే ఈ పార్టీలో రవి ఫ్యామిలీ ఫ్రెండ్స్, సన్నిహితులు సందడి చేశారు. కూతురు వియా డాన్స్ తో ఆకట్టుకుంది. కాగా.. యాంకర్ రవి గురించి ప్రేక్షకులకు తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ లో.. బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్నాడు. ప్రెజెంట్ పలు టీవీ షోలు చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నాడు. ఇక రవి ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ, డాటర్ వియాతో ఫోటోలు, పోస్టులు పెడుతూనే ఉంటాడు. మరి యాంకర్ రవి భార్య నిత్యా బర్త్ డే సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్ గా జరిపారు. మరి ఈ సర్ప్రైజింగ్ బర్త్ డే గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.