యాంకర్ లాస్య అనగానే గుర్తుకు వచ్చేది చీమ జోకులు, బిగ్‌బాస్‌లోని పప్పు జోక్స్, వ్లాగ్స్. బిగ్‌బాస్ 4వ సీజన్‌లో పాల్గొన్న లాస్య ప్రస్తుతం షోలతో పాటు.. యూట్యూబ్ చానెల్‌ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో లాస్య ఓ షాకింగ్ విషయం వెల్లడించారు. త్వరలోనే ఇల్లు అమ్మబోతున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు.. తాజాగా లాస్య.. తన అత్తగారి హోమ్ టూర్ చేసింది. ఈ క్రమంలో ఆ ఇంటి విశేషాలను, దానితో తన భర్త మంజునాథ్‌కు ఉన్న అనుబంధాన్ని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: ప్రేమ మైకంలో తప్పులు చేశా.. యాంకర్ లాస్య కన్నీరు!
ఈ ఇంటిని మంజునాథ్ తాతయ్య నిర్మించాడని.. అప్పట్లో ఇంటి నిర్మాణానికి 25 వేల రూపాయలు ఖర్చు అయ్యిందని తెలిపారు. ఇల్లు నిర్మించి 50 ఏళ్లు అవుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు అత్తామామ తమతో పాటే సిటీలో ఉంటున్నారని.. అందుకే త్వరలోనే ఈ ఇల్లును అమ్మేయబోతున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: దీపావళి స్పెషల్ సాంగ్ లో యాంకర్ లాస్యతో స్టెప్పులేసిన అమృత
ఇక ఈ ఇంటికి రెండు గుమ్మాలతో పాటు విశాలమైన గదులున్నాయి. హాల్, డైనింగ్ టేబుల్‌కో రూమ్, రెండు కిచెన్లు, దేవుడి రూమ్, బెడ్ రూమ్స్, స్టోర్ రూమ్ ఉన్నాయి. మోడ్రన్ మహాలక్ష్మి షోలో ఒక ఫ్రిజ్ గెలిచానని, అది ఈ ఇంట్లోనే ఉందని చూపించారు లాస్య. ఇంటి ముందు రెండు కొబ్బరి చెట్లు, పెరట్లో మూడు మామిడి చెట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అలా ఈ ఇంటితో తన భర్త, అత్తమామలు, తనకున్న అనుంబంధాన్ని వివరించారు లాస్య. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.