బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌పై సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. సమాజంలో జరుగుతున్న అంశాలు, తన కుటుంబం గురించిన అప్ డేట్స్ తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. ఇక 79 ఏళ్ళ వయసులోనూ ఎంతో ఉత్సాహంగా, చురుకుగా సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. కేవలం సినిమాల్లోనే కాక వెబ్ సిరీస్ లోనూ, రియాలిటీ షోలలోనూ పాల్గొంటూ నేటితరం నటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆయనకు ఎందరో అభిమానులున్నారు. ఇక ఆయన సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటుంది.
తన అభిమానులు కొన్నిసార్లు హద్దులు దాటినా ఆయన ఎంతో సహనంతో వారికి సమాధానాలు చెబుతుంటారు. ఈ క్రమంలో అమితాబ్ పై ఒక నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.. అది చూసి ఆయనకు ఎంతో ఓపికతో సరైన రీతిలో బుద్ది చెప్పారు. ఆయన పదకొండు గంటల తర్వాత గుడ్ మార్నింగ్ చెప్పడంతో కొంత మంది నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఇంత ఎర్లీ మార్నింగ్ విష్ చేయడం ఏంటని ఓ నెటిజన్ వ్యంగ్యంగా స్పందించాడు. మరొక నెటిజన్ అమితాబ్ ని అవమానించే విధంగా ఇది మధ్యాహ్నం ముసలోడా అంటూ కామెంట్ చేశాడు.

ఆ నెటిజన్ చేసిన కామెంట్ చూసి ‘తాను రాత్రి నుంచి షూటింగ్ లో పాల్గొనడం వల్ల లేట్ అయ్యిందని.. దాంతో మార్నింగ్ లేవడం ఆలస్యమైందని, కాబట్టే లేట్ గా విషెస్ చెప్పానన్నాడు’ అమితాబ్. ముసలోడా అన్న నెటిజన్ కి ‘మీరు ఎంతో కాలం జీవించాలని దేవున్ని కోరుకుంటున్నా.. అలాగే మీరు ఎవరినీ ముసలోడా అని పిలిచి అవమానించవొద్దని కోరుకుంటున్నా’ అంటూ జవాబు ఇచ్చాడు.
