తెలుగు చిత్రపరిశ్రమలో అల్లుఅర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్యాన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును బన్ని సంపాందించాడు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న బన్ని.. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను బన్నీ షేక్ చేశారు. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ బన్ని నటకు ఫిదా అయ్యారు ఆడియన్స్. పుష్ప మూవీతో బన్ని అనేక రికార్డులు క్రియేట్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ కి గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఇండియా పరేడ్ కు అల్లు అర్జున్ నాయకత్వం వహించారు. ఈ పరేడ్ కు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా ఎంతో ఘనంగా జరిగాయి. మన దేశంలోనే కాక ప్రవాస భారతీయులు ఉన్న అనేక దేశాల్లో భారత స్వాతంత్ర్య దినోత్వ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియా మొదలుకొని అమెరికా వరకు అన్ని దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తాజాగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల న్యూయార్క్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(FIA) ఇండియా డే పరేడ్ కలర్‌ఫుల్ గా నిర్వహించింది. ఆగస్టు 21న జరిగిన గ్రాండ్ ఇండియా పరేడ్‌కు పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్‌గా హాజరయ్యారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..ఏటా న్యూయార్క్‌లో ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. యేటా ఆగస్ట్‌లో నిర్వహించే పరేడ్ రోజున న్యూయార్క్ వీధులన్నీ త్రివర్ణపతాక శోభితంగా మారాయి. ఈ సారి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలోజరిగిన ప్రపంచంలోనే అతి పెద్ద ఇండియా పరేడ్ లో దాదాపు 4 లక్షల మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ పెరేడ్ లో ప్రవాస తెలుగు సంఘాలైన తానా, నాట్స్ వారి శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
బన్ని గ్రాండ్ మార్షల్ గా రావడంతో న్యూయార్క్ వీధులు ప్రవాస భారతీయులతో కిక్కిరిసి పోయాయి. అల్లు స్నేహరెడ్డితో కలసి బన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలోని అతి పెద్ద ఇండియా పరేడ్ కు అల్లు అర్జున్ నాయకత్వం వహిండంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
New York witnessed a mammoth crowd of over 5L people showering love at #AlluArjun as he graced the prestigious India Day parade as the Grand Marshal. This generous display of love by the fans proves that the icon star is now a global star. #GrandMarshalAlluArjunAtNYC pic.twitter.com/lxYUeZN22Y
— Venkatesh V (@Venkatesh_ET) August 22, 2022