అల్లు అర్జున్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ.. ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బన్నీ హీరోగా నటించిన తొలి చిత్రం గంగోత్రి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బన్నీకి జోడిగా అప్పటి స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లి.. అదితి అగర్వాల్ నటించారు. స్క్రీన్‌పై ఈ జోడి ఎంతో క్యూట్‌గా మెరవడమే కాక.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత అదితి అగర్వాల్ కొన్ని చిత్రాల్లో కనిపించింది. అనంతరం సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యింది. ఇక అదితి అక్క ఆర్తి అగర్వాల్.. సర్జరీ వికటించడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో సారి గంగోత్రి జంట.. అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. యూఎస్‌లో జరిగిన ఇండియా డే పరేడ్ న్యూయార్క్ 2022 ఉత్సవాల్లోభాగాంగా ఈ ఏడాది గ్రాండ్ మార్షల్ హోదాలో బన్నీ ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించారు. భార్య స్నేహా రెడ్డితో కలిసి ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏకంగా 5 లక్షల మంది హాజరై దేశభక్తిని.. అల్లు అర్జున్‌పై అభిమానాన్ని చాటుకున్నారు.
ఇండియా డే పరేడ్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న బన్నీని కలిశారు అదితి అగర్వాల్. ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోల్లో అదితిని చూసిన అభిమానులు.. ఏంటి ఇలా మారిపోయింది.. సడెన్‌గా చూస్తే గుర్తు పట్టలేం.. సినిమాలో ఎంతో ముద్దుగా ఉంది.. ఇప్పుడేంటి ఇలా మారింది అని కామెంట్స్ చేస్తే.. మరికొందరు మాత్రం.. సూపర్ క్యూట్ జోడి.. మరోసారి మీ ఇద్దరితో గంగోత్రి పార్ట్ 2 తీయొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ టాప్, సిల్వర్ కలర్ స్కర్ట్‌తోఘెంతో అందంగా ఉంది అదితి. ప్రస్తుతం గంగోత్రి పెయిర్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Icon Star Allu Arjun and actress #aditiagarwal latest click!
Allu Arjun meets his first heroine in New York.. 😘
The #Gangotri pair reunited after 19 years. 🔥#AlluArjun #PushpaTheRule pic.twitter.com/AHfreiBZnw
— Mallu Arjun Army Kerala™ (@MalluArjun_Army) August 21, 2022