ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి రెడీ అవుతోందని సమాచారం. బన్నీ బర్త్ డేకి ఇక రచ్చ రచ్చేనట. అసలు ఏంటా గిఫ్ట్ అంటే..!
టాలీవుడ్ బిగ్ స్టార్స్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. సినిమా సినిమాకు ఆయన తన ఇమేజ్ను, ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ఒక్క ‘పుష్ప’ మూవీతో రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆ మూవీలో ఆయన నట విశ్వరూపాన్ని చూపించారు. పుష్పరాజ్‌గా రగ్డ్డ్ లుక్‌లో తగ్గేదేలే అంటూ బన్నీ చేసిన పవర్ఫుల్ యాక్టింగ్‌కు బాక్సాఫీస్ షేక్ అయ్యింది. కలెక్షన్లలో తెలుగు నాట కంటే బాలీవుడ్లో ఈ మూవీ సంచలనం సృష్టించింది. ఉత్తరాది ప్రేక్షకులు పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్‌కు ఫిదా అయిపోయారు. పుష్ప సందడిని థియేటర్లలో ఎంజాయ్ చేశారు. వారు అంతలా ఆదరించారు కాబట్టే హిందీ బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప’ రూ.100 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ శరవేగంగా సాగుతోందని తెలుస్తోంది. సీక్వెల్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా క్వాలిటీ పరంగా ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదట సుకుమార్, బన్నీ. ఫస్ట్ పార్ట్ కంటే మరింత గ్రాండియర్‌గా రెండో పార్టును సిద్ధం చేస్తున్నారట. ఖర్చుకు వెనుకాడకుండా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారట. ‘పుష్ప: ది రైజ్’ను మరిన్ని భారతీయ భాషల్లో, సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా.. వచ్చే నెలలో బన్నీ బర్త్ డే ఉందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది బన్నీ బర్త్ డేను చాలా ప్రత్యేకంగా జరుపకుంటారు ఫ్యాన్స్. అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ గురించి ఎప్పుడూ వాళ్లు ఓ ఆర్మీ అని సంబోధిస్తుంటారు.
అలాంటి బన్నీ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. ‘పుష్ప 2’ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతోందని సమాచారం. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న ‘పుష్ప: ది రైజ్’ నుంచి 3 నిమిషాల యాక్షన్ టీజర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారట. టీజర్ కట్కు సంబంధించిన పనులతో పాటు మ్యూజిక్, బీజీఎం వర్క్ కూడా పూర్తయిందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. బన్నీ ఫ్యాన్స్‌తో పాటు ‘పుష్ప 2’ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఇందులో ఎంత నిజం ఉందనేది మూవీ మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు చెప్పలేం. మరి.. ‘పుష్ప: ది రైజ్’ నుంచి అప్డేట్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Here’s an exclusive #PushpaTheRule update for the fans who were asking.. pic.twitter.com/rjbqYvLZCW
— Aakashavaani (@TheAakashavaani) March 20, 2023