సుకుమార్.. టాలీవుడ్ లో క్రియేటీవ్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకున్న సుకుమార్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 విషయంలో డెడ్ లైన్ విధించాడట.
ఓ సినిమా తెరపైకి రావాలి అంటే.. వేల మంది కష్టపడాలి. రాత్రి పగలు తేడా లేకుండా షూటింగ్ జరిగితేనే సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుంది. అయితే చాలా సమయాల్లో సినిమాలు అనుకున్న తేదీకి రిలీజ్ కాకపోవడానికి బోలెడు కారణాలు ఉంటాయి. గ్రాఫిక్స్ అని, డబ్బింగ్ అని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లాంటివి లేట్ కావడంతో రిలీజ్ డేట్ కూడా ఆటోమెటిక్ గా మారుతుంటుంది. అయితే ఈ సారి పుష్ప 2 సినిమాను అనుకున్న తేదీకే తెరపైకి తీసుకురావాలని సుకుమార్ కు డెడ్ లైన్ విధించాడట స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
సుకుమార్.. టాలీవుడ్ లో క్రియేటీవ్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక అల్లు అర్జున్ తో తీసిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు సుకుమార్. అయితే సుకుమార్ కు ఇండస్ట్రీలో ఓ పేరుంది. అదేంటంటే? మూవీ పర్ఫెక్షన్ కోసం ఎంతో శ్రమిస్తాడని, దాని కోసం కథ, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ లాంటి విషయాల్లో బాగా టైమ్ తీసుకుని సినిమా షూటింగ్ ను ఆలస్యం చేస్తాడని ఇండస్ట్రీలో టాక్. ఇక పుష్ప సినిమా విషయంలో ఇదే జరిగి సినిమా షూటింగ్ తో పాటుగా రిలీజ్ విషయంలో ఆలస్యం జరిగింది.
అయితే పుష్ప పాన్ ఇండియా స్థాయిలో హిట్ కావడంతో ఈ విషయంపై పెద్దగా ఎవరూ ఫోకస్ పెట్టలేదు. ఇక సుకుమార్ పుష్ప 2 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే పుష్ప బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో రెండో భాగంపై మరింత గాట్టిగా కూర్చున్నాడు డైరెక్టర్ సుకుమార్. దాంతో పుష్ప రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత 2వ భాగం సెట్స్ మీదకు వెళ్లింది. అయితే పుష్ప2 సినిమా మేకింగ్ చాలా శ్రమతో కూడినది అని, అందుకే సుక్కు అంత టైమ్ తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే పుష్ప రిలీజ్ అయిన డిసెంబర్ 17వ తేదీకే సినిమాను రిలీజ్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడంట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అందుకోసం నేను ఎంతకైనా కష్ట పడతానని కాస్త గట్టిగానే సుక్కుకు తెలిపాడట.
దీంతో సుకుమార్ కూడా అలెర్ట్ అయ్యి షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే పుష్ప2లో రెండు చిన్న షెడ్యూల్స్ పూర్తి అయినట్లు సమాచారం. ఇక మూడో షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారట. దాదాపు నెలరోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తి అయితే దాదాపు 40 శాతం సినిమా పూర్తి అయిపోతుందట. ఇక నాలుగు నెలల ఇదే విధంగా కష్టపడితే సినిమా కంప్లీట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారంట. ఇక షూటింగ్ పూర్తి అయిన తర్వాత ప్రి ప్రొడక్షన్, ప్రమోషన్స్ కు దాదాపుగా మూడు నెలల సమయం ఉంటుంది. దాంతో గట్టిగా ప్రయత్నిస్తే డిసెంబర్ 17న సినిమాను తీసుకురావొచ్చు అంటున్నారు సినీ పండితులు. అయితే ఈ డేట్ మిస్ అయితే మాత్రం 2024 సంక్రాంతికే పుష్ప2 ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరి సుకుమార్ కు అల్లు అర్జున్ డెడ్ లైన్ పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.