భారతీయ సినీ పరిశ్రమలో మహానటి సావిత్రిది ఒక చెరగని చరిత్ర.. ఎవరూ చెరపలేనటువంటి చరిత్ర. ఆమె తర్వాత మళ్ళీ అలాంటి మహానటి రారు, రాలేరు అని అంటారు. అంతలా తన నటనతో కట్టిపడేసారు. అయితే ప్రతీ జనరేషన్ లోనూ ముందు తరం నటుల హావభావాలు, నట వైభవం, ప్రతిభ, వ్యక్తిత్వం ఇలా కొన్ని అంశాలను నేటి తరం స్టార్లు కలిగి ఉంటారు. వారంత కాకపోయినా.. వారిలో ఉన్న కొంత అయినా తమలో ఆకళింపు చేసుకుంటారు. ఆ రకంగా చూసుకుంటే మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటి, హీరోయిన్ సౌందర్య అని చెప్పవచ్చు. నటన పరంగా, వ్యక్తిత్వం పరంగా మంచి మార్కులే పడ్డాయి. సావిత్రి తర్వాత సావిత్రి అనేలా సౌందర్య అద్భుతమైన నటనతో తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నారు.
రెండు జనరేషన్లు వెళ్లిపోయాయి. ఇప్పుడు ఈ జనరేషన్ లో మహానటి ఎవరు? సావిత్రి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో నట వైభవాన్ని ప్రదర్శించే హీరోయిన్ ఎవరు? అనే చర్చ లేకపోలేదు. ఇదే విషయాన్ని బాలకృష్ణ తన షోకి వచ్చిన గెస్ట్ లని అడిగారు. అన్ స్టాపబుల్ షోతో ఆహా ఓటీటీలో బాలకృష్ణ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో సెలబ్రిటీని తీసుకొచ్చి రచ్చ రచ్చ చేస్తున్న బాలకృష్ణ.. 5వ ఎపిసోడ్ కి మాత్రం కె. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు విచ్చేసారు. అయితే ఈ షోలో బాలకృష్ణ.. ‘కరెంట్ జనరేషన్ లో తర్వాతి మహానటి ఎవరు? అని అల్లు అరవింద్ ని, సురేష్ బాబుని అడిగారు. దానికి వారు సమంత పేరు చెప్పారు.
ఇద్దరికీ వేరువేరుగా టాస్క్ ఇచ్చి.. తర్వాతి మహానటి ఎవరో రాయమని బాలకృష్ణ అనగా.. వారు సమంత పేరు రాసుకొచ్చారు. ఇద్దరూ అనుకోకుండా.. తమ మనసులో మాటను బయటపెట్టారు. సమంత గురించి అరె ఇద్దరం మాట్లాడుకోలేదు అని అల్లు అరవింద్ అనగా.. ఉన్న హీరోయిన్స్ లో అవ్వగలిగితే సమంత ఒక్కర్తే అవుతుందని సురేష్ బాబు అన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ కాగా.. ఈ వీడియోని కట్ చేసి సమంత అభిమానులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘ఇండస్ట్రీ దిగ్గజ నిర్మాతల నోటి నుంచి మా సమంత పేరు వచ్చింది. మహానటి సమంత పేరుకి నీ డెడికేషన్, హార్డ్ వర్క్ కారణం. నువ్వు సంపాదించావు. నీకు అర్హత ఉంది’ అంటూ ఫ్యాన్ పేజ్ లో పోస్ట్ చేశారు. దాన్ని సమంత రీట్వీట్ చేసింది.
— Samantha (@Samanthaprabhu2) December 3, 2022