Subhashini: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఎన్నో ఏళ్లుగా ఇటు టీవీ షోలకు, అటు సినిమాల ప్రమోషన్స్ లో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అందులోనూ ఎంటర్టైన్ మెంట్ టీవీ షోలు చేయడంలో సుమ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. సుమ యాంకరింగ్ చేస్తున్నటువంటి పాపులర్ షోలలో క్యాష్ ప్రోగ్రాం ఒకటి.
వారానికి ఒకసారి ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ క్యాష్ ప్రోగ్రాంలో ప్రతి ఎపిసోడ్ లో కొత్త కొత్త గెస్టులను ఆహ్వానించి సందడి చేస్తుంటారు. అలాగే వారి మంచి చెడులతో పాటు కెరీర్, పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ కూడా స్టేజిపై షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో క్యాష్ ప్రోగ్రాంకు సంబంధించి తాజాగా కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈసారి షోలో సీనియర్ నటులు జెన్నీ, అల్లరి సుభాషిణి, బాలాజీ, కృష్ణవేణి పాల్గొన్నారు.
ఇక ప్రోమో అంతా సుమ స్టైల్ లో చాలా సందడిగా సాగినప్పటికీ, చివరిలో ఎవరికి వారే కెరీర్, లైఫ్ గురించి తలచుకొని ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా అల్లరి సుభాషిణి కొన్నేళ్లుగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాంకర్ సుమ తనకు ప్రతి 6 నెలలకు ఓసారి మెడిసిన్స్ పంపిస్తుందని, తాను ఈరోజు నిలబడడానికి కారణం సుమేనని చెబుతూ కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ప్రోమోలో అల్లరి సుభాషిణి మాటలు హైలైట్ అవుతున్నాయి. మరి అల్లరి సుభాషిణి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.