సాధారణంగా బుల్లితెరపై ఎన్నో షోలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులు హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. అలా వారి మనసుల్లో స్థానం సంపాదించుకున్న షో ‘అలీతో సరదాగా’. కమెడియన్ అలీ తనదైన వాక్ చాతుర్యంతో వచ్చే అతిథులను ముప్పు తిప్పలు పెట్టి నవ్వులు పూయిస్తుంటాడు. అప్పుడప్పుడు కన్నీళ్లు కూడా పెట్టిస్తుంటాడు. అందుకే ఈ షో అంటే ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఇక డిసెంబర్ 19వ తారిఖుకు సంబంధించిన ఎపిసొడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఎపిసొడ్ కు స్టార్ యాంకర్ సుమ అతిథిగా వచ్చారు. తమదైన శైలిలో ఇద్దరు సరదాగా నవ్వించారు. ఇక ఈ ప్రోమోలో తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మధ్య గ్యాప్ ఎలా వచ్చిందో తెలిపే ప్రయత్నం చేశాడు అలీ.
పవన్ కళ్యాణ్ – అలీ.. ఇండస్ట్రీలో ఎంత మంచి స్నేహితులో మనందరికి తెలిసిందే. కానీ సిద్దాంతాలు, రాజకీయా భావాజాలల దృష్ట్యా గత కొంత కాలంగా పవన్ కు అలీకు మధ్య దూరం పెరిగింది. ఇక అలీ సైతం ఏపీలో కీలక పదవిలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం జరిగిన అలీ కూతురి పెళ్లికి సైతం పవన్ హాజరుకాలేదు. దాంతో వీరిద్దరి మధ్య దూరం ఉంది అని అందరు అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పెళ్లికి ఎందుకు రాలేదో అలీ చెప్పడంతో ఈ వార్తలకు పుల్ స్టాప్ పడింది. ఇక తాజాగా వచ్చిన అలీతో సరదాగా ప్రోమోలో ఇద్దరి మధ్య గ్యాప్ ఎలా వచ్చిందో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అలీ.
ఈ క్రమంలోనే గెస్ట్ గా వచ్చిన యాంకర్ సుమ.. యంకరింగ్ చేస్తే, అలీ అతిథిగా మారారు. మీకూ పవన్ కళ్యాణ్ కి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? అని సుమ ప్రశ్నించగా..”నాకు పవన్ కు మధ్య గ్యాప్ లేదు. దానిని బయటి వారే సృష్టించారు. మా అమ్మాయి పెళ్లికి కూడా వస్తా అన్నారు. కానీ ఫ్లైట్ మిస్ కావడంతో రాలేకపోయారు” అంటూ అలీ చెప్పుకొచ్చారు. ఇక మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పండి అని సుమ అడిగితే.. అలీ సిగ్గుపడుతూ తన తొలి ప్రేమ గురించి వివరించాడు. అలాగే తన చిన్నతనంలో జరిగిన సంఘటనను తలచుకుని భావోద్వేగానికి గురయ్యడు అలీ. ఈ ప్రోమో చూసిన అభిమానులు.. పవన్ కు అలీ కి మధ్య గ్యాప్ క్రియేట్ చేసిన వ్యక్తులు ఎవరో అని తెలుసుకోవడానికి ఆత్రుత పడుతున్నారు. డిసెంబర్ 19న ప్రసారం అయ్యే ఈ ఎపిసొడ్ కోసం వెయిట్ చేస్తున్నారు.