తెలుగు ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సాహిత్య యోధుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతో యావత్ చిత్ర పరిశ్రమ తీరని శోకంలో మునిగిపోయింది. సిరివెన్నెల అందరిని విడిచి వెళ్లిపోడంతో ప్రతి ఒక్కరికి కన్నీళ్లు కట్టలు తెంచుకుంటున్నాయి. ఆయన మృతిపై పలువురు జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్‌లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శించుకుంటున్నారు.
తెలుగు సినీ సాహితీ సౌరభం సీతారామశాస్త్రి గురించి అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. సిరివెన్నెలతో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. తెలుసా మనసా అనే పాట నాకు గుర్తు వస్తుంది. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలే కాదు ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా ఇదే మాటలు వినిపిస్తూ ఉంటారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.