టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిత్వం పరంగానూ ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కొందరైతే పవన్ కల్యాణ్ మా దేవుడు అంటూ చెప్పుకుంటారు. ప్రేక్షకులే కాదు.. టాలీవుడ్‌లో సెలబ్రిటీలు సైతం పవన్ కల్యాణ్‌కు అభిమానులే. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అని పవన్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే అటు సినిమాల్లోనూ దూసుకెళ్తున్నారు. టాలీవుడ్‌లో ఎంతో మంది పవన్ గురించి మాట్లాడారు, మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా మరోసారి అక్కినేని నాగార్జున పవన్ కల్యాణ్ గురించి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కార్తీ నటించిన సర్దార్ సినిమాకి సంబంధించి హైదరాబాద్ లో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్‌లో పాల్గొన్న నాగార్జన మాట్లాడుతూ పవన్ గురించి ఈ కామెంట్ చేశాడు. “అన్న ఒక సూపర్ స్టార్ అయినప్పుడు ఆ స్టార్డమ్ షాడో నుంచి పక్కకు వచ్చి స్టార్ గా ఎదిగినవాళ్లను ఇద్దరినే చూశాను. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, కర్ణాటకలో శివన్న తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్, తమిళంలో సూర్యా తమ్ముడు కార్తీ. వీళ్లు బాగా అరుదైన నటులు” అంటూ కింగ్ నాగార్జునా చెప్పుకొచ్చాడు. అన్న స్టార్‌గా ఉన్న సమయంలో వారి ఇమేజ్ నుంచి పక్కకు వచ్చి స్టార్లుగా ఎదిగేవారు చాలా అరుదుగా ఉంటారంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.
కార్తీ సర్దార్ సినిమా విషయానికి వస్తే.. ఒక స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీపావళి కానుకగా ఈ సినిమా తీసుకొస్తున్నారు. కార్తీకి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతని సినిమాకి తెలుగులోనూ తమిళ్ మూవీకి పోటీగా కలెక్షన్స్, రెస్పాన్స్ ఉంటుంది. కార్తీకి కూడా తెలుగు ప్రేక్షకుల అంటే ఎంతో అభిమానం. తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ తమిళనాడులో కూడా దొరకదు అంటూ కామెంట్ చేస్తుంటాడు. అంతేకాకుండా యుగానికి ఒక్కడు సినిమాలోని ఎవర్రా మీరంతా.. ఇంత ప్రేమ చూపిస్తున్నారు అంటూ నవ్వులు పూయించాడు.