నాగార్జునతో పాటు ఆయన కుటుంబంలో కొంత మందికి మొదటి పెళ్లి అంత అచ్చిరాలేదని చెప్పాలి. నాగార్జున.. వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నాగ చైతన్య పుట్టిన తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. అఖిల్, నాగ చైతన్యల విషయంలోనూ అదే రుజువు అయ్యింది. అయితే..
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర తారల్లో ఒకరు నాగార్జున. లెజండరీ నటుడు నాగేశ్వరరావు నట వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు ఈ మన్మథుడు. అయితే నాగార్జునతో పాటు ఆయన కుటుంబంలో కొంత మందికి మొదటి పెళ్లి అంత అచ్చిరాలేదని చెప్పాలి. నాగార్జున.. వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య పుట్టిన తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున, నటి అమలను వివాహం చేసుకున్నారు. వీరికి అఖిల్ పుట్టాడు. నాగార్జున విషయంలో ఫెయిలైన బంధమే.. పిల్లల్ని వెంటాడేలా చేసింది. నాగ చైతన్య, సమంత ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకోగా.. వీరి కాపురం మూడు నెలల ముచ్చటగా నాలుగేళ్ల పాటు సాగింది. ప్రస్తుతం వీరి అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
వీరిద్దరి పెళ్లి కన్నా ముందే నాగ్ -అమల ముద్దుల తనయుడు అఖిల్ విషయంలోనూ ఇదే రిపీట్ అయ్యింది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకె రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌తో ప్రేమలో ఉన్న అఖిల్.. 2016లో నిశ్చితార్థం చేసుకున్నాడు. 2017లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. సినీ,రాజకీయ, వ్యాపార వేత్తలను ఆహ్వానించారు. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి అనగానే.. అఖిల్, శ్రియా మధ్యలో మనస్పర్థలు రావడంతో వివాహం రద్దు చేసుకున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత శ్రియా.. రామ్ చరణ్ భార్య, ఉపాసన కజిన్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిన్ దిత్ రెడ్డిని 2018లో వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి రామ్ చరణ్, మహేష్ దంపతులు హాజరయ్యారు
ప్యాషన్ డిజైనర్ అయిన శ్రియా దంపతులకు ఓ బాబు జన్మించాడు. అతడికి ఇవాన్ సోమి రెడ్డి అనే పేరు పెట్టారు. అయితే ఆమె ఇప్పుడు వీరిద్దరూ మరోసారి తల్లిదండ్రులు అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓపార్టీలో మహేష్ బాబు, నమ్రత, సితార తదితరులు పాల్గొని సందడి చేశారు. ఈ ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. అందులో మహేష్ క్యూట్ లుక్స్‌లో కనిపించారు. కాగా, శ్రియా వదిన దియా.. నమ్రతా శిరోద్కర్ కు మంచి ఫ్రెండ్ కావడం గమనార్హం. అలా శ్రియాకు కూడా వారితో మంచి ర్యాపో ఉండటంలో ఈ వేడకకు హాజరయ్యారు మహేష్ దంపతులు.