అక్కినేని అందగాడు అఖిల్.. హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు గానీ సరైన హిట్ ఇప్పటివరకు పడలేదు. చేసిన మూవీస్ అన్నీ కూడా సాఫ్ట్ స్టోరీస్ కావడం వల్లనో ఏమో గానీ ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. చివరగా చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. అఖిల్ కూడా బాగానే చేశారు అన్నాడు గానీ ఆడియెన్స్ మైండ్ లో అయితే రిజిస్టర్ కాలేకపోయాడు. దీంతో ఈసారి యాక్షన్ తో రచ్చ లేపేందుకు సిద్ధమైపోయాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫుల్ ఆన్ యాక్షన్ స్టోరీలో అఖిల్ ఫస్ట్ టైమ్ నటించిన మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీస్తున్న ఈ సినిమా రెండేళ్ల క్రితమే స్టార్ట్ అయింది. కారణాలు ఏంటనేది పక్కన బెడితే రిలీజ్ డేట్ అనుకున్న ప్రతిసారి వాయిదా పడుతూనే వచ్చింది. మొన్న వెళ్లిపోయిన సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ప్రకటించడంతో పాటు చిన్నపాటి వీడియో టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.
ఏప్రిల్ 28న థియేటర్లలోకి ‘ఏజెంట్’ రానుంది. ఇక రిలీజ్ చేసిన వీడియోలో అఖిల్ ని కుర్చీకి కట్టేసి ఉంచారు. ఒళ్లంతా రక్తంతో కేవలం డ్రాయర్ తో మాత్రమే ఉన్న అఖిల్ ని ఓ వ్యక్తి చిత్రహింసలు పెడుతూ కనిపించాడు. ఎవర్రా నువ్వు అని అడిగితే.. ‘వైల్డ్ సాలే’ అని అఖిల్ డైలాగ్ చెప్పడం సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఇదిలా ఉండగా ‘ఏజెంట్’లో హీరోయిన్ వైద్య సాక్షి అనే అమ్మాయి నటించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషించాడు. మరి గత కొన్నాళ్ల నుంచి వాయిదా పడుతున్న ‘ఏజెంట్’.. ఈసారి అయినా పక్కగా వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.