తెలుగు సినీ ఖ్యాతిని పెంచిన చిత్రంగా ఇప్పటికే ఎన్నో ప్రశంసలు అందుకున్న 'ఆర్ఆర్ఆర్'.. తాజాగా ఆస్కార్ కొట్టి తన బ్రాండ్ ఇమేజీని అమాంతం పెంచేసుకుంది. దీంతో ఇప్పుడు సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ విషయం వినిపిస్తోంది.
తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు. నిన్నటివరకు ఇది కల ఏమో గానీ ఇప్పుడు మాత్రం అందరూ ఒప్పుకొనే రియాలిటీ. తెలుగు సినిమా గురించి దేశం మాట్లాడుకుంటే చాలు అనే స్టేజ్ నుంచి తెలుగు సినిమా గురించి మాత్రమే దేశం మాట్లాడుకోవడం ఒక్క ‘ఆర్ఆర్ఆర్’ వల్లే సాధ్యమైంది. కాదు కాదు దాన్ని సాధ్యం చేసి చూపించాడు ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ SS రాజమౌళి. ఆయన దర్శకత్వ ప్రతిభపై ఎవరికీ ఎలాంటి డౌట్ లేదు కానీ ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ రావడంతో పూర్తిగా లెక్కలన్నీ మారిపోయాయి. సీక్వెల్ విషయంలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ ఈ సినిమాకు సీక్వెల్ పక్కానా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజమౌళి సినిమాలంటే ఫుల్ కమర్షియల్. ప్రేక్షకుడు సంతృప్తి పడటం పక్కగా ఉంటుంది. స్టూడెంట్ నం.1 దగ్గర నుంచి గతేడాది మార్చిలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ వరకు ఆల్మోస్ట్ ఇదే స్టయిల్ ఫాలో అయ్యాడు. అయితే ‘బాహుబలి’ తన స్టైల్ ని పూర్తిగా మార్చేశాడు. పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టి.. తెలుగు సినిమా అంటే సౌత్ వరకు మాత్రమే కాదని ప్రూవ్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బాహుబలి సీక్వెల్ రాజమౌళి రేంజుని చాలా పెంచేసింది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’కు ఏకంగా ఆస్కార్ రావడంతో ఇతడి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ అనేది ఓ బ్రాండ్ అయిపోయింది.
అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొదలుపెట్టినప్పుడు గానీ, తీస్తున్నప్పుడు గానీ ఎవరూ ఆస్కార్ వరకు వెళ్తుందని అనుకోలేదు. కానీ వెస్ట్రన్ ఆడియెన్స్ ఈ మూవీ చూసి ఫిదా అయిపోయారు. రిలీజ్ తర్వాత కూడా దాదాపు ఏడాది పాటు రాజమౌళి ఈ సినిమా గురించి సమయం వెచ్చించాడు. అయితే గతేడాది మార్చిలో మూవీ రిలీజ్ అయినప్పుడే సీక్వెల్ గురించి టాక్స్ వచ్చాయి. రాజమౌళితో పాటు రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా సీక్వెల్ ఆలోచన ఉందని అన్నారు. ఇప్పుడు ఆస్కార్ గెలిచేసరికి అది తీయడం పక్కా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తన సినిమాని రాజమౌళిని అంత ఈజీగా వదిలేయకపోవచ్చు. కాబట్టి.. మహేష్ సినిమా పూర్తయ్యేలోపు RRR సీక్వెల్ పై పక్కాగా అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్సులు కచ్చితంగా ఉన్నాయనిపిస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తుంది కూడా. మరి ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.