రాజమౌళి.. సినిమా, సినిమాకి దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ, తెలుగు సినిమాకి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేసి క్రియేటివ్ జీనియస్ అనిపించుకుంటున్నారు.
తెలుగు సినీ ఖ్యాతిని పెంచిన చిత్రంగా ఇప్పటికే ఎన్నో ప్రశంసలు అందుకున్న 'ఆర్ఆర్ఆర్'.. తాజాగా ఆస్కార్ కొట్టి తన బ్రాండ్ ఇమేజీని అమాంతం పెంచేసుకుంది. దీంతో ఇప్పుడు సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ విషయం వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్.. దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా పీరియాడిక్ బ్లాక్ బస్టర్.. బాక్సాఫీస్ వద్ద విడుదలై ఎనిమిది నెలలు కావస్తోంది. అయినా ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జనాలు కూడా ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అందుకు కారణం ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఏడాది మార్చిలో ఒకేసారి విడుదలైనప్పటికీ, ఇప్పుడు ఒక్కో భాషలో రిలీజ్ అవుతుండటం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. ఇతర స్టార్ కాస్ట్ తో రూపొందిన ఈ సినిమా […]