సెలబ్రిటీల పెళ్లి వార్తలు వినేందుకు అభిమానులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ప్రస్తుతం బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలలో ఎప్పుడెప్పుడు ఎవరి పెళ్లి వార్త ముందుగా వస్తుందో అని వెయిట్ చేస్తున్నారు. ఈ వరుసలో డార్లింగ్ ప్రభాస్, శర్వానంద్, సాయిధరమ్ తేజ్, అడివి శేష్.. ఇలా పెద్ద లిస్టే ఉంది. కానీ.. కెరీర్ లో బిజీ అయ్యేసరికి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైనప్పుడల్లా క్లారిటీ ఇవ్వకుండా ఏదోకటి చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు హీరోలు. ఇటీవల ఓ టీవీ షోతో పాటు అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న అడివి శేష్.. పెళ్లి గురించి అడిగితే ప్రభాస్, శర్వానంద్ ల పేర్లు చెబుతూ నాకంటే సీనియర్స్ ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. కొన్నాళ్లుగా అడివి శేష్ కి, కింగ్ నాగార్జున మేనకోడలు యార్లగడ్డ సుప్రియకి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటివరకు అటు శేష్ గానీ, ఇటు సుప్రియ గానీ స్పందించలేదు. కానీ.. తాజాగా వీరిద్దరి మధ్య రిలేషన్ నిజమేనంటూ ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటో బట్టి చూస్తే.. శేష్, సుప్రియ లవ్ లో ఉన్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా.. ఇంకా ఎందుకని వీరిద్దరూ లవ్ మ్యాటర్ ని అధికారికంగా ప్రకటించట్లేదు? అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా క్రిస్మస్ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి అందరూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
అక్కినేని క్రిస్మస్ పార్టీలో హీరో అడివి శేష్ సైతం పాల్గొన్నాడు. ఆ సెలబ్రేషన్స్ ఫోటోలను అఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడా పిక్స్ లో అక్కినేని ఫ్యామిలీ వారు కాదు.. హీరో అడివి శేష్ స్పెషల్ అట్రాక్షన్ గా మారాడు. శేష్ అక్కినేని ఫ్యామిలీ కాదని అందరికి తెలుసు. కానీ.. ఈ కొత్త ఫోటోలు చూస్తుంటే అక్కినేని ఫ్యామిలీ శేష్ ని ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్ గా చేర్చేసుకున్నట్లు అనిపిస్తోంది. పిక్ లో శేష్ పక్కన సుప్రియ.. ఒకరినొకరు చూసుకుంటూ కనిపించేసరికి.. వీరి జంటని అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడో ఓకే చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే.. దాదాపు నాలుగేళ్లుగా శేష్, సుప్రియల పేర్లు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటిదాకా ఏ ఒక్కరూ పెదవి విప్పలేదు.
ఇదిలా ఉండగా.. సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ ని చూసుకుంటూ బిజినెస్ వుమన్ గా రాణిస్తోంది. ఈమెకు గతంలోనే చరణ్ రెడ్డి అనే నటుడితో వివాహమై.. కొన్నాళ్ళకు విడిపోయారు. అప్పటినుండి సింగిల్ గా ఉంటోంది. మరోవైపు అడివి శేష్ లైఫ్ లో ఏదో ట్రాజిక్ లవ్ స్టోరీ ఉందని.. పైగా ఇంట్లో పెళ్లిపై ప్రెజర్ పెడుతున్నారని చెబుతుంటాడు. కానీ.. సుప్రియతో రిలేషన్ షిప్ విషయాన్ని మాత్రం ఎప్పుడూ ప్రస్తావించడు. తాజా సమాచారం ప్రకారం.. సుప్రియ నిర్మాతగా అడివి శేష్ తో అన్నపూర్ణ బ్యానర్ లో ఓ పాన్ ఇండియా మూవీ ప్లానింగ్ జరుగుతోందట. మరి ఈ క్రిస్మస్ పిక్ సంగతేంటీ? అనంటే.. అది వారే చెప్పాలి. మరి అక్కినేని ఫ్యామిలీలోకి అడివి శేష్ చేరిపోయాడు అని వస్తున్న కథనాలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.