అలనాటి హీరోయిన్ మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యాసాగర్ లంగ్స్ ఫెయిల్ అవ్వడం వల్లే చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది జనవరి నెలలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా నుంచి అంతా కోలుకున్నారు. కానీ, అప్పటి నుంచి విద్యాసాగర్ ఊపిరితిత్తులు బాగా క్షీణించాయి.
అయితే గత కొన్ని వారాల క్రితం విద్యాసాగర్ ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. అది అంత సులువైన పని కాదు.. ఎందుకంటే ఊపిరితిత్తులు డోనర్ కావాలంటే అంతను బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అయి ఉండాలి. విద్యాసాగర్ కంటే ముందు ఎంతో మంది వెయిటింగ్ లిస్టులో ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. ఇన్నాళ్లు వైద్యులు చికిత్స చేస్తూ వస్తున్నారు. కానీ, ఇలా విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు.
మీనా భర్త మృతితో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యారు. మీనా భర్త మృతి పట్ల ప్రముఖులు, సినిమా పెద్దలు సంతాపం తెలియజేశారు. మీనా, కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. మీనా భర్త మృతి పట్ల కామెంట్స్ రూపంలో మీ సంతాపాన్ని తెలియజేయండి.