సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్ లకు కెరీర్ చాలా తక్కువ. రోజులు గడుస్తున్న కొద్ది గ్లామర్ ఫేడ్ అవుట్ అయిపోవడం, వయసు మీదపడటంతో కుర్ర హీరోల సరసన జోడీ కుదరకపోవడం లాంటి కారణాలతో కొన్ని సంవత్సరాల్లోనే ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అవుతారు నటీమణులు. ఇక వయసు మీదపడటంతో సినిమాల్లో చూసిన ప్రేక్షకలు భయట వాళ్లను చూసి గుర్తుపట్టడానికి కాస్తంత సమయం తీసుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ సైతం ఇలానే గుర్తుపట్టలేనంతగా తయ్యారు అయ్యింది. 90వ దశకంలో కుర్రాళ్ల గుండెల్ని తన గులాబీ చూపులతో బంధించిన అలనాటి తార మహేశ్వరి. ప్రస్తుతం గుర్తు పట్టలేనంతగా తయ్యారు అయ్యింది. బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తో దిగిన పిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
మహేశ్వరి.. అంటే ఇప్పటివాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. అదే గులాబీ సినిమా హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వస్తుంది. 1995లో వచ్చిన అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ అమ్మడు. అదే ఏడాది వచ్చిన ‘గులాబీ’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. జేడీ చక్రవర్తి హీరోగా మహేశ్వరి హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. తన అందం, అభినయంతో కుర్రకారు మదిని దొచుకుంది గులాబీ సోయగం. గులాబీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా మహేశ్వరికి అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. వడ్డే నవీన్ హీరోగా పెళ్లి, జేడీ చక్రవర్తితో దెయ్యం, మృగం లాంటి సినిమాల్లో నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి.
ఈనేపథ్యంలోనే ఇటు తెలుగుతో పాటుగా తమిళంలోను వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ.. స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది గులాబీ బ్యూటీ. అయితే మహేశ్వరి నటించిన సినిమాలు థియేటర్ల వద్ద నిరాశ పరచడంతో.. ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అదీకాక కొత్త కొత్త హీరోయిన్ లు రావడంతో ఇండస్ట్రీ నుంచి కనుమరుగైయ్యారు మహేశ్వరి. 2000లో వచ్చిన ‘తిరుమల తిరుపతి వెంకటేశా’ చిత్రమే మహేశ్వరి చివరి సినిమా. అనంతరం సినిమాలు దూరం అవ్వడంమే కాక బయట ఎక్కడా కనిపించడంలేదు. తాజాగా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తో దిగిన ఫొటోలో మహేశ్వరి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. జాన్వీకపూర్ కు మహేశ్వరి పిన్ని వరుస అవుతుంది. ఓ షూటింగ్ లో భాగంగా మహేశ్వరితో జాన్వీ ఫొటో తీసుకుంది. ప్రస్తుతం ఈ పిక్ చూసిన వారంత.. అదేంటి ఎలా ఉండే మహేశ్వరి ఎలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.